ఇరకాటంలో ఈటల రేవంత్ మాటల మరమ్మేంటి?

Publish Date:Jan 26, 2023

Advertisement

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ( టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. కేసీఆర్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో  బీజేపీలో చేరిన ఈటల నిరాశకు గురయ్యారని, ముఖ్యంగా బీజేపీలోనూ కోవర్టులున్నారనే విషయం అర్థమై ఆయన లక్ష్య సాధన కోసం ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవలసినపరిస్థితి వచ్చిందని చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చల్లో ప్రముఖంగా చర్చకు వస్తున్నాయి. నిజానికి  కేసీఆర్ కోవర్టులు అన్నిపార్టీలలో ఉన్నారు.

అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ లో కొంచెం చాలా ఎక్కువగానే ఉన్నారు. ఆ విషయాన్నీ స్వయంగా రేవంత్ రెడ్డి లేదా అద్దంకి  దయాకర్ వంటి అయన అనుచరులు బహిరంగంగా, పేర్లతో సహా బయట పెడుతూనే ఉన్నారు. నిజానికి, కోవర్టుల చర్చతోనే కాంగ్రెస్ పార్టీలో రచ్చ మొదలైంది. సీనియర్  జూనియర్ వివాదం పురుడు పోసుకుంది. అధిష్టానం జోక్యం చేసుకున్నా చల్లారని స్థాయిలో కోవర్టు మంటలు గాంధీ భవన్ లో ఎగిసి పడుతున్నాయి. అయినా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చల్లో ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.   

ముఖ్యంగా బీజేపీలో నాయకులు, శ్రేణుల్లో అయితే ఈ చర్చ మరింత జోరుగా సాగుతోంది. నిజమే, రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా బీజేపీ చేరిన నాయకులకు, ముఖ్యంగా రాజకీయాల్లో అనేక ఎత్తుపల్లాలు చూసి వచ్చిన ఈటల రాజేందర్ వంటి సీనియర్  నాయకులకు ఆశించిన స్థానం, గౌరవం దక్కడం చాలా కష్టమే. సో.. ఈటల గానీ, రేవంత్ రెడ్డి ప్రస్తావించిన మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, వివేక్ వెంకట స్వామి వంటి వారు బీజేపీలో ఉక్కపోతకు గురవుతున్నమాట వాస్తవం కావచ్చును. కానీ  వారికి మరో ప్రత్యామ్నాయం కూడా లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది కానీఅదే రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో కూరుకుపోయింది.

దీంతో  బీఆర్ఎస్  ప్రత్యామ్నాయం బీజేపీ ఒక్కటే అనే పర్సెప్షన్ ప్రజల్లో నాటుకు పోయింది. అందువలన కేసేఆర్ వ్యతిరేకులకు మరోమార్గం లేకుండా పోయిందని అంటున్నారు. మరో వంక బీజేపీ ముఖ్య నేతలు మాత్రం  రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మరో కోణంలో చూస్తున్నారు. రేవంత్ రెడ్డి  మాట తీరు ఆయనలోని ఫ్రస్ట్రేషన్ కు అద్దం పడుతోందని  అంటున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ సీనియర్లు ఎవరూ గుర్తించడమే లేదని బీజేపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తన పరిస్థితి ఏమిటో తనకే తెలియని అగమ్యగోచర స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారని, ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఆయన ఈటల మాటలకు వక్రభాష్యం చెపుతున్నారని అంటున్నారు.

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీని మాత్రమే గుర్తిస్తున్నారని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గుర్తిస్తే మంచిదని అంటున్నారు. అదలా ఉంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా అనేక విషయాలు ముచ్చటించిన రేవంత్ రెడీ, ఈటలతో పాటుగా, కేసీఆర్ ను  గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన నాయకులు.. ఇప్పుడు ఆ పార్టీలో సంతృప్తిగా లేరని, పేర్కొన్నారు.  బీజేపీ కేసీఆర్ ఒక్కటే అన్న విషయం ఈటల రాజేందర్ మాట్లల్లో స్పష్టమైంది కాబట్టి ప్రజలు దీనిపై ఆలోచించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

ఈటల రాజేందర్, వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటివారు బీజేపీ సిద్ధాంతాలను విశ్వసించరు. కేవలం కేసీఆర్ ను మాత్రమే వ్యతిరేకిస్తారు. బీజేపీ ఐడీయాలజీతో ఆ ముగ్గురికి సంబంధం లేదు. బీజేపీలో కూడా కోవర్ట్ లు ఉన్నారని ఈటల అన్నారంటే ఏదో అసంతృప్తి ఉన్నట్లే కదా? ఈటల ముందుకు రాలేక  వెనక్కి పోలేని స్థితిలో ఉన్నారని రేవంత్ చెప్పుకొచ్చారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పరిస్థితి అంతకంటే గొప్పగా ఏమీ లేదనీ అందుకే సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న రేవంత్ రెడ్డి, బీజేపీలోని ఈటల, వివేక్, కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి సీనియర్ నాయకులకు ఒక నిగూఢ సందేశం ఇచ్చారని కొందరు అంటున్నారు. ఏమైనా, ఓ వంక ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య గణతంత్ర వివాదం పతాక స్థాయికి  చేరిన నేపధ్యంలో రేవంత్ రెడ్డి ఉద్దేశ పూర్వకంగానే మరో చర్చకు ఆస్కారం కల్పించారని అంటున్నారు.

By
en-us Political News

  
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.