Publish Date:May 18, 2026
పశ్చిమ బెంగాల్ రాజకీయంలో విధానపరంగా కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మతపరమైన సంస్థలకు, వ్యక్తులకు అందిస్తున్న ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పూర్తిగా రద్దు చేసింది వచ్చే నెల నుండి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా హిందూత్వ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉండే పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీ, అధికారంలోకి రాగానే మతపరమైన వర్గీకరణల ఆధారంగా నడిచే పథకాలను నిలిపివేయడం గమనార్హం. గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇమామ్‌లు, ముయెజ్జిన్‌లు, ఆలయ పూజారులకు నెలవారీ గౌరవ వేతనాలను ప్రకటించారు. ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రవేశపెట్టిన ఈ విధానాలన్నింటికీ ప్రస్తుత సువేందు సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టేసింది. దీనితో పాటు గత ప్రభుత్వ హయాంలో మదరసాలకు కేటాయించిన ప్రత్యేక పథకాలను కూడా నూతన ప్రభుత్వం రద్దు చేసింది. ఓటు బ్యాంకు రాజకీయాలు లేదా నిర్దిష్ట వర్గాలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఉద్దేశించిన పథకాలను తమ ప్రభుత్వం ప్రోత్సహించబోదని ముఖ్యమంత్రి సువేందు అధికారి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రజాధనాన్ని కేవలం ప్రజల సంక్షేమం, విద్యా రంగం, ఆర్థిక సాధికారత కోసమే వినియోగించాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిధుల పంపిణీ అక్రమాలపై విచారణ జరిపేందుకు సువేందు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది. గతంలో కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం ఉదంతంతో పాటు సందేశ్‌ఖాలీలో వెలుగుచూసిన మహిళలపై లైంగిక వేధింపుల ఘటనల నేపథ్యంలో, నూతన ప్రభుత్వం మహిళా రక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఎన్నికల ప్రచారంలో తాము ఇచ్చిన భత్, నాట్ భత్తా అంటే.. ఉచిత భత్యాలు కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ముఖ్యం అనే నినాదానికి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సువేందు అధికారి స్పష్టంగా చెప్పారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును మతపరమైన కార్యక్రమాలకు కాకుండా, ప్రజా సంక్షేమానికి మళ్లించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/end-to-financial-assistance-based-on-religion-25-220215.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.