ఏపీ లిక్కర్ స్కామ్.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడి నోటీసులు
Publish Date:Jan 19, 2026
Advertisement
ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులోపలువురు కీలక వ్యక్తులను విచారించిన ఈడి, రెండు రోజుల కిందట వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా వైసీపీకి చెందిన మరో ఎంపీకి నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మిధున్ రెడ్డిని ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఇదే కేసులో ఎంపీ మిధున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడి అనుమానిస్తోంది. లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో హవాలా మార్గంలో భారీ ఎత్తున జరిగిన నగదు చలామణి లో మిథున్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును వివిధ మార్గాల్లో మనీ ల్యాండరింగ్ చేశారనీ, ఆ సొమ్ము కీలక వ్యక్తుల వరకూ చేరిందని ఈడీ అనుమానిస్తోంది. జగన్ హయాంలో అమలు చేసిన మద్యం విధానంలో లైసెన్సుల కేటాయింపు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కీలకంగా భావి స్తున్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మిథున్ రెడ్డి పాత్రపై స్పష్టత కోసం ఆయనను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్కామ్‌కు సంబంధించి పలువురు అధికారులు, వ్యాపారులు, మధ్యవర్తులను విచారించిన ఈడి, తాజాగా ఎంపీ స్థాయి నేతకు నోటీసులు ఇవ్వడంతో కేసు దర్యాప్తు తుదిదశకు చేరుకున్నదని భావించవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిథున్ రెడ్డి విచారణ లో కొత్త ఆధారాలు వెలుగు లోకి వచ్చే అవకాశ ముందం టున్నారు. మనీ ట్రయిల్‌పై ఈడి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ పరిణా మాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతు న్నాయి. మిథున్ రెడ్డి ఈడి విచారణకు ఎలా స్పందిస్తారన్నది, విచార ణలో ఏమి బయటపడ నున్నదని, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
http://www.teluguone.com/news/content/ed-notices-to-ycp-mp-mithunreddy-25-212701.html





