Publish Date:Jun 22, 2022
నేషనల్ హెరాల్డ్‌కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) సుదీర్ఘ సమయం ప్రశ్నించడం కేంద్ర ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడగానే కనపడుతోందని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ ఆరోపించారు. బుధవారం ఏకంగా 12 గంటలపాటు ప్రశ్నించడం వెనుక మోడీ సర్కార్ కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకోవడమే కనపడుతోందని అన్నా రు. ఇది కేవలం మోదీ సర్కార్‌ను నిలదీస్తున్నందుకు కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్ పార్టీనే కాదు మొత్తం ప్రతిపక్షాలనూ కేంద్రం టార్గెట్ చేసినట్టు స్పష్టమవు తోందని ఆరోపించారు.
ఇన్‌కమ్ టాక్స్, సిబిఐ, ఈడీ వంటి సంస్థలతో వరుస దాడులు చేపట్టడం బిజెపి ప్రభుత్వం ప్రతిపక్షాల పట్ల వ్యవహరిస్తున్న తీరును బహిర్గతం చేస్తుందనేది దేశంలో ప్రతీ పౌరుడికీ తెలిసిపోయిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్షం లేకుండా చేసుకోవాలన్న ఆతృత బిజెపి కనిపిస్తున్నదనీ, ఇటువంటి చర్యల ద్వారా ఆ పార్టీ తన ఉద్దేశాన్ని స్వయంగా బహిర్గతం చేసుకుంటోందని పైలట్ అన్నారు.
రాహుల్ గాంధీని జూన్ 13 నుంచి 15వ తేదీ వరకూ ఇ.డి 40 గంటలకు పైగా ప్రశ్నించడం దారుణమని పైలట్ అన్నారు. రాహుల్ తన తల్లి సోనియాగాంధీ అనారోగ్యం కారణంగా వ్యక్తిగతంగా పిలిచి ప్రశ్నించడానికి కొంత సమయాన్ని ఇవ్వాలని ఆయన తరఫున కాంగ్రెస్ నేతలు ఈడీ ని కోరారు. కానీ అందుకు ఇ.డి నుంచి ఎలాంటి సానుకూల స్పందనా రాలేదు.
కానీ ఆయన్ను జూన్ 20 రావచ్చునని ఈడీ . తెలియజేసింది. మంగళవారం అర్ధరాత్రి వరకూ ఆయన్ను ప్రశ్నించడం కొనసాగింది. అంతేగాక జూన్ 15న ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకుని వచ్చి నాయకులపై దాడి చేయడం అమానుషమని పైలట్ వర్ణించారు. పోలీసులు వృత్తి ధర్మం కాకుండా గూండాగిరీ ప్రద ర్శించడం దారుణమని దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ed-inquiry-of-rajiv-iscenter-political-harrasment-39-138209.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.