హేమంత్ సొరేన్ కు ఈసీ షాక్

Publish Date:Aug 25, 2022

Advertisement

 కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ జార్ఖండ్ సీఎంకు హేమంత్ సొరేన్ కుషాక్ ఇచ్చింది.  ఆయనపై అనర్హత వేటు వేయాలని సూచిస్తూ   ఝార్ఖండ్ గవర్నర్‌ రమేశ్ బియాస్‌ కు లేఖ రాసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానుగా గనులను సీఎం కేటాయించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయంగా తెలిసింది. తన అభిప్రాయాన్ని ఎన్నికల కమిషన్ సీల్డ్ కవర్‌లో ఝార్ఖండ్ రాజ్‌భవన్‌కు  పంపింది.  

ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని  సెక్షన్ 9-ఏను హేమంత్ సోరెన్  ఉల్లంఘించారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 192 ప్రకారం ఒక శాసన సభ్యుడు ఏదైనా అనర్హతలకు లోబడి ఉన్నారా? లేదా? అనే ప్రశ్న తలెత్తితే ఈ అంశాన్ని గవర్నర్‌కు పంపుతారు. ఆయన నిర్ణయమే అంతిమంగా ఉంటుంది. ఇటువంటి అంశాలపై నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని గవర్నర్ కోరతారు.  

 దీని నేపథ్యం అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ సన్నిహితుడు ప్రేమ్ ప్రకాశ్ హస్తం ఉందని అనుమానించి ఈడీ.. కొన్నాళ్ల కిందట అతడి నివాసంలో సోదాలు నిర్వహించిన సందర్భంగా  ఏకే 47 రైఫల్స్   బయటపడ్డాయి. ఇక, మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన ఝార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీలో పలు చోట్ల తనిఖీలు చేపట్టిన ఈడీ  సీఎం హేమంత్ సోరెన్‌కు రాజకీయ సన్నిహితుడు పంకజ్ మిశ్రా,  బచ్చు యాదవ్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సోదాల్లో  కోట్లాది రూపాయలు విలువైన ఆస్తులు,  బ్యాంకు ఖాతాల్లో రూ.13.32 కోట్ల నగదును జప్తు చేసిన సంగతి విదితమే. అయితే శిబు సొరేన్ కు ఈసీ ఇచ్చిన షాక్   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒకింత ఇబ్బందికరమైన అంశమే నని పరిశీలకులు అంటున్నారు.

కేసీఆర్ జాతీయ రాజకీయ ఆకాంక్షలకు మద్దతు ఇచ్చిన బీజేపీయేతర నేతలలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ముఖ్యులు. ఈ నేపథ్యంలోనే గత ఏప్రిల్ 28న హేమంత్ సొరేన్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అంతకు ముందు అంటే మార్చి నెలలో సీఎం కేసీఆర్ రాంచీ వెళ్లి హేమంత్ సరేన్ తో భేటీ అయ్యారు.   మళ్లీ  నెల రోజుల వ్యవధిలోనే ఇరువురు సీఎంలూ రెండో సారి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు సందర్బాలలోనూ జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటు విషయంపై ఇరువురి మధ్యా చర్చ జరిగిందని చెబుతున్నారు.

 అంతే కాకుండా 
‘మేఘా’సహా మరో రెండు కంపెనీలకు జార్ఖండ్ లో కాంట్రాక్టుల విషయంపై సీఎం కేసీఆర్  జార్ఖండ్ సీఎంకు సిఫారసు చేశారనీ, వీరిరువురి మధ్యా ఈ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చిదనీ కూడా అప్పట్లో వార్తలు వినవచ్చాయి.  త్వరలోనే జార్ఖండ్ లో మేఘా కంపెనీ, మరో రెండు కంపెనీలకు కాంట్రాక్టులు లభించే అవకాశాలు ఉన్నాయని అప్పట్లో రాజకీయ వర్గాలలో బాగా ప్రచారమైంది. అలాగే హేమంత్ సొరేన్ తన తల్లి వైద్యం కోసమే గత ఏప్రిల్ లో హైదరాబాద్ వచ్చారనీ, హైదరాబాద్ కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్  డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆయన తల్లికి వైద్యం చేశారనీ, డాక్టర్ నాగేశ్వరరెడ్డితో కేసీఆర్ స్వయంగా మాట్లాడి మరీ హేమంత్ సొరేన్ తల్లికి వైద్యం నిమిత్తం అప్పాయింట్ మెంట్ ఫిక్స్ చేశారనీ అంటున్నారు.  

మొత్తం మీద తెలంగాణ సీఎం కేసీఆర్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయనీ రాజకీయవర్గాలు చెబుతుంటాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్ వ్యవహారంలో హేమంత్ సొరేన్ పై ఈసీ అనర్హత వేటు వేయడం కేసీఆర్ రాజకీయ ఆకాంక్షల విషయంలో పెద్ద ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు.

అన్నిటికీ మించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహితంగా మెలిగిన వారికి ఏదో విధంగా రాజకీయంగా నష్టం వాటిల్లడం మామూలైపోయిందనీ, ఆ కారణంగానే కేసీఆర్ తో రాజకీయంగా చేతులు కలిపేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్ధితి ఏర్పడిందని రాజకీయ వర్గాలలో ఓ చర్చ అయితే ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇప్పుడు దానికి బలం చేకూర్చే విధంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ చిక్కుల్లో పడి పదవి కోల్పోయి పరిస్థితికి వచ్చారు.  

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.