సమయానికి తినకపోతే ఈ సమస్య రావడం పక్కా..!
Publish Date:Jan 10, 2026
Advertisement
ఆహారం శరీరానికి ఎంతో అవసరం. తీసుకునే ఆహారం వల్లనే శరీరానికి శక్తి వస్తుంది. ముఖ్యంగా ఆహారంలో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, ఖనిజాలు చాలా అవసరం. ఇవన్నీ ఆహారంలో ఉండటం ఎంత ముఖ్యమూ. ఆహారం తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యం. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతారు. అలా చేయకపోతే జీవక్రియకు ఆటంకం కలుగుతుంది. కేవలం జీవక్రియ ప్రభావితం కావడమే కాదు.. సమయానికి ఆహారం తీసుకోకపోతే అది చాలా తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుందట. సమయానికి ఆహారం తీసుకోకపోతే జరిగేదేంటో తెలుసుకుంటే.. మైగ్రేన్.. ఆహారం సమయానికి తీసుకోకపోతే అది తలనొప్పి సమస్యగా మారుతుందట. మరీ ముఖ్యంగా ఈ తలనొప్పి కాస్తా మైగ్రేన్ గా మారే అవకాశం ఉంటుందట. మైగ్రేన్ చాలా తీవ్రమైన తలనొప్పికి కారణం అవుతుంది. ఆహారం సమయానికి తీసుకోకపోతే ఇది వారంలో రెండు నుండి మూడు రోజులు మైగ్రేన్ కారణంగా బాధపడాల్సి ఉంటుందని ఆహార నిపుణులు, వైద్యులు అంటున్నారు. మైగ్రేన్ వల్ల జరిగేది ఇదే.. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల వచ్చే మైగ్రేన్ నొప్పి ఒక రోజు మాత్రమే ఉంటుందట. కానీ దానివల్ల ఏకాగ్రత లేకపోవడం, దృష్టి లేకపోవడం, అలసట, బలహీనత మైగ్రేన్ ప్రభావాన్ని మరింత పెంచుతాయి. దీని కారణంగా మైగ్రేన్ తరువాత రెండు మూడు రోజులు ఏ పనిని ఏకాగ్రతగా చేయలేరు.. . సమయానికి తినాలి.. జాగ్రత్తగా, సమయానికి తినడం వల్ల తలనొప్పి, దాని వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారించవచ్చు. అందుకే ఎన్ని పనులున్నా సమయానికి ఆహారం తినడాన్ని విస్మరించకూడదు. పెద్దవారు ఉదయం ఆఫీసుకు వెళ్ళేముందు, పనికి వెళ్ళేముందు తినడం తప్పనిసరి.. అలాగే పిల్లలకు కూడా తప్పనిసరిగా పాఠశాలకు వెళ్ళేముందు ఆహారం పెట్టాలి. ఎక్కువ సేపు టీవి, ఫోన్, కంప్యూటర్ వంటివి చూడటం వల్ల పిల్లలలోనూ, పెద్దలలోనూ తలనొప్పి, మైగ్రేన్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఆహారం దగ్గర నిర్లక్ష్యం చేయకూడదు. *రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
http://www.teluguone.com/news/content/eat-on-time-to-escape-these-health-effects-34-212334.html





