Publish Date:Jun 18, 2026
తెలంగాణకు భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్ ఫోర్స్ మరోసారి ఉక్కు పాదం మోపింది. ఒడిశా లోని దట్టమైన కోరాపుట్ అటవీ ప్రాంతంలో అత్యంత సాహసోపేతంగా నిర్వహిం చిన ఈ ఆపరేషన్‌లో ఈగల్ ఫోర్స్ 500 కిలోల గంజా యిని స్వాధీనం చేసుకు న్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈగల్ ఫోర్స్ నిర్వహించిన ఈ హై రిస్క్ ఆపరేషన్‌కు ఒడిశా పోలీసులు ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపిం చారు.విశ్వసనీయమైన సమాచారం అందడంతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ బృందాలు, బలిమేళా నుంచి జయపూర్ వరకు సుమారు 80 కిలోమీటర్ల మేర గంజాయి తరలిస్తున్న బొలెరో వాహనాన్ని వెంబడించారు.
అడవులు, ఘాట్ రోడ్లు దాటుకుంటూ సాగిన ఉత్కంఠభరిత చేజింగ్ అనంతరం వాహ నాన్ని అటవీ ప్రాంతం లో నిలిపివేసిన డ్రైవర్ చీకటి మాటున పరారయ్యాడు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు అందులో మొత్తం 115 ప్యాకెట్లలో దాచిన 500 కిలోల గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు. వీటిలో 90 ప్యాకెట్లు ఐదు కిలోల చొప్పున, మరో 25 ప్యాకెట్లు రెండు కిలోల చొప్పున ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు బొలెరో వాహనాన్ని ఒడిశా కోరాపుట్ పోలీసు లకు అప్పగించారు.
ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసు కున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాహనం ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాకు చెందిన అమీర్ అలీ ఖాన్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.కాగా, 2024లో కూడా రాంచీ వరకు వెంబడించి 500 కిలోల గంజాయిని పట్టుకున్న ఈగల్ ఫోర్స్, మరోసారి అదే స్థాయిలో విజయవంతమైన అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వ హించడం విశేషం.... తెలంగాణకు మాదకద్ర వ్యాల సరఫరాను అడ్డుకునే క్రమంలో ఈగల్ ఫోర్స్ చేప డుతున్న వరుస చర్యలు స్మగ్లింగ్ ముఠాల్లో గుండె దడ పుట్టిస్తున్నాయి... తెలంగాణ ఈగల్ ఫోర్స్ చేసిన సాహసాన్ని చూసి ఒరిస్సా పోలీసులు సైతం అవాక్కయ్యారు.... ఒరిస్సా పోలీసు ఉన్నతాధికారులు ఈగల్ ఫోర్స్ ను అభినందించారు...
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/eagle-force-attack-in-odisha-forests--interstate-gang-39-223406.html
Publish Date:Sep 10, 2026
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
Publish Date:Sep 10, 2026
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.