ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేర్లు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. వీరిద్దరూ చిత్ర విచిత్ర విన్యాసాలతో నిత్యం వార్తల్లో ఉంటుంటారు. ఇప్పుడు తాజాగా దువ్వాడ మిస్సింగ్ అంటూ దివ్వెల మాధురి చేస్తున్న హడావుడి మరో కొత్త డ్రామాయా అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో గత కొంతకాలంగా వ్యక్తిగత, రాజకీయ వివాదాలతో వార్తల్లో నిలిచిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఎపిసోడ్ లో.. దువ్వాడ అదృశ్యం వార్త కలకలం రేపుతోంది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు. అయితే ఆయన భారీ ర్యాలీగా బయలుదేరి మార్గమధ్యంలో ఎలా మిస్సౌతారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దువ్వాడ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కొత్తూరు పోలీసు స్టేషన్ కు చేరుకున్నా.. దువ్వాడ మాత్రం అక్కడకు రాలేదు.
దీంతో దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులే రహస్యంగా అదుపులోకి తీసుకుని ఉంటారంటూ ఆరోపణలు గుప్పించారు. ఎవడో ఊరూ పేరూ లేని వాడు కేసు పెడితే.. ఒక ఎమ్మెల్సీని పోలీసు స్టేషన్ కు పిలుస్తారా? అంటే మండిపడ్డారు. దువ్వాడకు ఏదైనా జరిగితే.. ఎవరినీ వదిలిపెట్టనంటూ పోలీసులపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. కొత్తూరు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
దివ్వెల మాధురి చేస్తున్న ఆరోపణలను కొత్తూరు పోలీసులు తోసిపుచ్చారు. తాము దువ్వాడ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయలేదని, అసలు ఆయన పోలీస్ స్టేషన్ కే రాలేదని స్పష్టం చేశారు. దువ్వాడే అరెస్టు భయంతో అజ్ణాతంలోకి వెళ్లి ఉంటారని పోలీసులు అంటున్నారు. ఇక పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన దివ్వెల మాధురిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇక ఈ డ్రామాలో ట్విస్ట్ ఏమిటంటే.. పోలీసు స్టేషన్ కు బయలుదేరిన దువ్వాడ రూటు మార్చి.. ఒడిస్సావైపు వెళ్లడం. ఈ విషయాన్ని పోలీసులు ఆయన ఫోన్ సిగ్నల్స్ ద్వారా సాంకేతికంగా ధృవీకరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/duvvada-goes-missing-while-heading-to-the-police-station-25-224743.html
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.