Publish Date:Aug 31, 2024
వామ్మో... వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మామూలోడు కాదు.. మహా జాదూ.. అందుకే ఆయన భార్య వాణి, కుమార్తెలు దువ్వాడని అంతలా వ్యతిరేకిస్తున్నారు. మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ ఇష్యూగా మారిన దువ్వాడ ‘ఆయనకిద్దరు’ వ్యవహారం ఈమధ్యకాలంలో చల్లబడింది. ఇప్పుడు ఆ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. దువ్వాడ వారి రాసలీలల స్టోరీ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఎంత మాస్టర్ కిలాడీలో బయటపెట్టే ఆధారం బయటకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి జీవితంలోకి ప్రవేశించిన మూడో మనిషి దివ్వెల మాధురి యాక్సిడెంట్ చేయడం, దువ్వాడ వాణి పెట్టిన టార్చర్ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవడానికే యాక్సిడెంట్ చేశానని చెప్పడం అందరికీ తెలిసిందే. అయితే, అయి నిజంగా జరిగిన యాక్సిడెంటేనని, ఆత్మహత్యాయత్నం కోసం చేసిన యాక్సిడెంట్ కాదని బయటపడింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటపడింది. దివ్వెల మాధురికి యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆమెని అంబులెన్స్.లో ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో దువ్వాడ శ్రీనివాస్‌కి ఆమె ఫోన్ చేసింది. ఇలా తనకు యాక్సిడెంట్ జరిగిందని, తనను అంబులెన్స్.లో ఆస్పత్రికి తీసుకెళ్తున్నారని మాధురి చెప్పింది. అప్పుడు దువ్వాడ శ్రీనివాస్‌లో వున్న అసలు సిసలు వైసీపీ లీడర్ బయటకి వచ్చాడు. అయితే, నువ్వు పోలీసులకి, మీడియాకి ఆత్మహత్య చేసుకోవడానికే యాక్సిడెంట్ చేశానని చెప్పు. దువ్వాడ వాణి నన్ను వేధించినందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని చెప్పు. మిగతా అన్ని విషయాలు నేను చూసుకుంటాను అని మాధురికి చిలకకి చెప్పినట్టు చెప్పాడు. మాధురి కూడా అయితే నా దగ్గరకి వెంటనే మీడియాని పంపు.. నువ్వు చెప్పమన్నట్టే చెబుతాను అని చెప్పింది. ఈ ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం అలా వుంచితే, ఇంత రచ్చ చేసిన దివ్వెల మాధురిని ఇంకా పోలీసులు ఎందుకు అరెస్టు చేయాలేదో అర్థం కావడం లేదు. యాక్సిడెంట్ చేయడం, ఇలా పోలీసులను, మీడియాని తప్పుదోవ పట్టించడం లాంటి నేరాలు చేసిన మాధురి హ్యాపీగా రీల్స్ చేసుకుంటూ, మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ టైమ్‌పాస్ చేస్తోంది. ఇప్పుడు ఈ ఫోన్ కాల్ లీక్ తర్వాత అయినా పోలీసులు దువ్వాడ మాధురి విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటారేమో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/duvvada-audio-leak-39-184001.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.