తెలంగాణకు కాబోయే సీఎం షర్మిల.. డీఎస్ ఆశీర్వాదానికి కారణమేమిటి?

Publish Date:Jul 25, 2022

Advertisement

ధర్మపురి శ్రీనవాస్ కాంగ్రెస్ అగ్ర నేతలలో ఒకరిగా వెలుగొందారు.  సీఎం పదవి ఆయనదే అని ఒక సమయంలో అంతా భావించారు. 1989లో మంత్రిగా పని చేసిన ఆయన దశాబ్ద కాలంలో రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకులలో ఒకరిగా ఎదిగారు. రాష్ట్ర విభజన జరిగే వరకూ ఆయన కాంగ్రెస్ నేతే. ఆ తరువాతే ఆ పార్టీకి దూరమయ్యారు. ముఖ్యంగా వైఎస్ లో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. పీసీసీ చీఫ్ గా ఆయన, ముఖ్యమంత్రిగా వైఎస్ ఇద్దరూ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపారు. అయితే విభజన తరువాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి గూటికి చేరారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అయితే ఆ తరువాత పార్టీతో విభేదించారు. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తరువాత ఆయనకు తెరాస మరో అవకాశం ఇవ్వలేదు. అసలు ఆయనకు పార్టీకీ సంబంధమే లేదన్నట్లుగా తెరాస వ్యవహరిస్తున్నది. డీఎస్ కూడా అంతే పార్టీతో అంటీముట్టనట్లే ఉన్నారు.  దూరం జరిగారు. అయితే తెరాసకు మాత్రం రాజీనామా చేయలేదు. ఈ రోజుకూ ఆయన టీఆర్ఎస్ సభ్యుడే. అయితే టీఆర్ఎస్ లో ఉన్నారంటే ఉన్నారు అంతే. డీఎస్ కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీ ఎంపీ.. దాంతో కొద్ది కాలం కిందట డీఎస్ కమలం గూటికి చేరతారన్న వార్తలు వినవచ్చినా ఆయన చూపంతా సొంత గూటిపైనే అంటే కాంగ్రెస్ పైనే. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు కారణాలేమైనా ఫలించలేదు. అందుకు వయోభారం కూడా ఒక కారణమని చెప్పాలి.

అయితే ఇప్పుడు ఆయన చూపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లిందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ప్రగతి మార్గంలో ముందుకు సాగాలంటే వైఎస్సార్ కుమార్తె షర్మిల రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన పేర్కొన్నారు. అక్కడితో ఆగలేదు ఆమె ముఖ్యమంత్రి అవుతారనీ, రాజకీయాలలో తన అంచనాలు ఇప్పటి వరకూ తప్పలేదని ప్రకటించారు. 2004  లో వైఎస్సార్ సీఎం అవుతారని ముందుగా చెప్పింది తానేననీ డీఎస్ చెప్పుకున్నారు. ఇంతకీ ఆయనకు హఠాత్తుగా షర్మిలపైనా, ఆమె పార్టీపైనా ఇంత అభిమానం ఎందుకు వచ్చింది. ఈ ప్రశ్నకు కూడా పరిశీలకులు సమాధానం చెబుతున్నారు. వయో భారం కారణంగా ఇంటికే పరిమితమైన డీఎస్ ను పలకరించే వారే కరవైన పరిస్థితి. అన్నేళ్ల పాటు సేవ చేసిన కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు.. తాను ప్రస్తుతం సభ్యుడిగా ఉన్న టీఆర్ ఎస్ వదిలేసింది. ఆ సమయంలో  షర్మిల తన డీఎస్ కి ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తన తండ్రికి మిత్రుడు కనుక తనకూ పితృ సమానేడే అని  స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి  పలకరించి క్షేమ సమాచారాలు అడిగారు. అంతే పొంగిపోయిన డీఎస్ ను తెలంగాణకు కాబోయే సీఎం నువ్వేనమ్మా అని ఆశీర్వదించేశారు. ఇటు షర్మిలకు తన పార్టీలో చెప్పుకోదగ్గ పెద్ద నాయకుడెవరూ లేరు.. అటు డీఎస్ కు పలకరించి క్షేమ సమాచారాలు ఆరా తీసే వారు కరవైయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆయనతో షర్మిల భేటీ కావడంతో డీఎస్ వైఎస్సీటీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్ వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

దాంతో ఆమె తన తండ్రి  సహచరులను వరసగా కలవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ క్రమంలో డీఎస్ ని కూడా కలసి ఆయనతో మంతనాలు సాగించారు అని అంటున్నారు. ఇక టీయారెస్ లో ఉన్నట్లా లేనట్లా అన్నట్లుగా ఉన్న డీఎస్ షర్మిలమ్మ పార్టీలో చేరుతారా అన్నది ఒక చర్చ. ఆయన కనుక చేరితే కచ్చితంగా వైఎస్సార్టీపీకి ఎంతో కొంత బలం చేకూరినట్లే. డీఎస్ పెద్ద నాయకుడు. పైగా బీసీ నేతగా బలమైన గొంతుక కలిగిన వారు మరి ఆయన షర్మిల పార్టీలో చేరడానికేనా ఆమె ఫ్యూచర్ సీఎం అని జోస్యం చెప్పినది అన్న మాట కూడా ఉంది.

ఏది ఏమైనా షర్మిల పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అన్నది ఒక అంచనాకు అందని అతి పెద్ద  సందేహం. అయితే బడా నాయకులు కొందరు చేరితే మాత్రం కచ్చితంగా తాను గెలవకపోయినా కాంగ్రెస్ ని చీల్చే స్థాయిలో మాత్రం ఉంటుంది అని చెప్పవచ్చు.   ఈ పరిణామాలు అన్నీ షర్మిల సీఎం పదవి కోసం కాకుండా కేసీయార్ ని మూడవసారి గెలిపించడానికే పనికివచ్చినా వస్తాయని అనే వారూ ఉన్నారు. మొత్తానికి డీఎస్ తాపీగా ఒక రాజకీయ  జోస్యం వదిలారు. ఫ్యూచర్ లో చూసుకోండి షర్మిల సీఎం అంటున్నారు. మరి ఇది చెప్పిన ఆయన తాను ఏ పార్టీయో మాత్రం చెప్పలేదు. అదే కదా రాజకీయ గడుసుదనం అంటే.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.