Publish Date:Aug 14, 2022
క్లాస్ ఫస్ట్ రాలేదు, ఉద్యోగంలో ప్రమో షన్ రాలేదు, పోనీ ఊరికేమైనా ఘన కార్యం చేశాడా అంటే అదీ లేదు. కానీ హుస్సేన్ని మాత్రం లెబనీయులు హీరో అనే అంటున్నారు. కారణం అత ను తన బ్యాంక్ అకౌంట్లో కొంత డబ్బు తీసుకోవడానికి నానా హడావుడీ చేయాల్సి వచ్చింది. చాలామంది భయపడ్డారు కూడా. సినిమా క్రైమ్ సీన్స్‌ని తలపిస్తుంది.
ఈమధ్యనే ఒకరోజు బస్సాం అల్-షేక్ హుస్పేన్ అనే వ్యక్తి లెబనాన్ బీరూట్‌కి చెందిన హామ్రా లో ఒక బ్యాంక్ కి వెళ్లాడు. అందరూ డబ్బులు తీసుకోవ డానికి వెళ్లనట్టే వెళ్లలేదు. చేతిలో ఏకం గా షాట్ గన్ పట్టుకుని మరీ వెళ్లాడు. లోపలికి వెళ్లగానే అక్క డున్న వారిని బెదిరించాడు. అంతే కాదు ఒక రౌండ్ కాల్పులూ జరిపేడు. అయితే అక్కడున్నవారికేమీ కాకుండానే చేశాడా పని. నిజానికి అతను బ్యాంక్‌ను మరీ దోపిడీ చేసి పోవాలని దొంగలా చొరబడలేదుట. అతని అకౌంట్‌లోంచి కొంత డబ్బు తీసు కోవడానికే వచ్చానని తీరిగ్గా చెప్పి డబ్బు తీసుకున్నాడు.
బీరూట్ ఫెడరల్ బ్యాంక్ అనే బ్యాంక్‌లో హుస్సేన్ అకౌంట్‌లో సుమారు 1.67 కోట్లు డబ్బు ఉంది. అందులోంచి రూ.7,96 లక్షలు తీసుకోవాలని వెళ్లాడు. కానీ బ్యాంక్ వారు అంత మొత్తం ఒక్కసారిగా ఇవ్వడానికి అంగీకరించినట్టు లేదు. అతను అడిగాడు, ప్రాధేయపడ్డాడు. తన తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడు. ఆయన మందులు, ఆస్పత్రి బిల్లు కట్టడానికి చేతిలో చిల్లి గవ్వ లేదు, ఇపుడు బ్యాంక్ నుంచే తీసి ఇవ్వాలని వేడుకున్నాడు. బహుశా బ్యాంక్‌వారు తిరస్కరించి ఉంటారు. అతగాడికి కోపం వచ్చి ఓ పదిమందిని షాట్‌గన్ చూపించి డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. అంతే బ్యాంక్‌వారు భయపడి ఆయన అడిగింది మూటగట్టి మరీ ఇచ్చారు. వాస్తవానికి లెబనాన్‌లో ఆర్ధికపరిస్థితులు ఈ మధ్యకాలం ఊహించని విధంగా మార్పు చెందాయని వార్తలు వస్తున్నాయి.
హుస్సేన్ నవ్వుతూ అవి తీసుకుని సిగెరెట్ వెలిగించుకుని మరీ బయటకి వచ్చాడు. కానీ మెట్లు దిగ్గానే పోలీసులు ఎదుర య్యారు. కానీ హుస్సేన్ సినిమాల్లోలా పారిపోలేదు. వాళ్లదగ్గరికే వెళ్లి లొంగపోయాడు. ఇంత పనిచేసేవేంద్రా భయ్.. అంటూ. బేడీలే వేసారు. అయ్యా నా పరిస్థితిల్లో ఎవరున్నా ఇంతే ఆవేశపడతారని అన్నాడు హుస్సేన్. అసలే పోలీసులు, అతడి మాట ల్ని అస్సలు నమ్మలేదు. పైగా ఇప్పటికే ఒకసారి ఇలాంటి దోపిడీ జరిగిందని ఇతన్ని కట్టడి చేయకపోతే మరీ సంఖ్య పెంచు తాడని భయపడే పోలీసులు అరెస్టు చేశారట. ట్విస్ట్ ఏమిటంటే, హుస్సేన్ ధైర్యసాహసా లకు బీరూట్ ప్రజలు మాత్రం అతన్ని హీరోగానే పిలుస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/drama-at-lebanan-bank-25-141898.html
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.