ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్.. ఏ విషయంలోనంటే?

Publish Date:Aug 20, 2026

Advertisement

ఇరాన్ తో యుద్ధం, హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా తాజాగా చేసిన క్లెయిమ్ ల నేపధ్యంలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు ఓ వార్నింగ్ ఇచ్చారు.  ఇరాన్ కి ఏ రకమైన సహాయ సహకారాలు అందించినా..  లేదా ఆ దేశానికి ఆర్థిక సహకారం అందించినా, అందించే ప్రయత్నం చేసినా తీవ్ర  పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆయన  ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో  ఆర్థిక ఆంక్షలు విధిస్తామన్న ట్రంప్..  దీనిని  ఆర్థిక యుద్ధంగా పరిగణించాలంటూ.. తన అధికారికి సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ లో ప్రకటించారు.  

 ఏ దేశమైనా తమ భూభాగంలోని ఆర్థిక సంస్థలు, బ్యాంకింగ్ వ్యవస్థలు, విమానాశ్రయాలు,  ప్రభుత్వ రంగ సంస్థలను ఇరాన్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు ఉపయోగిస్తే.. ఆయా దేశాలు కూడా అమెరికా  ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.  ఇరాన్ ఆర్థిక రంగానికి ఊతమిచ్చే నకిలీ కంపెనీల కార్యకలాపాలు, చమురు అక్రమ రవాణా, నిధుల బదిలీలను వెంటనే నిలిపివేయాలని అల్టిమేటమ్ ఇచ్చారు.

ఇప్పటికే కొనసాగుతున్న ఆంక్షలు, సైనిక చర్యల కారణంగా ఇరాన్ నావికాదళం, వాయుసేనతో పాటు మిలిటరీ మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్న ట్రంప్. ప్రభుత్వం కూడా కుప్పకూలే స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. ఈ  పరిస్థితుల్లో ఇరాన్  అణ్వస్త్ర సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని, దీనికోసం అంతర్జాతీయ సమాజం  సహకరించాలని పిలుపునిచ్చారు. 

Donald Trump warning to World countries,  US Iran economic war,  Trump Truth Social post, Iran sanctions, Iran nuclear dispute

By
en-us Political News

  
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో  దోషిగా  తీహార్ జైళ్లో  శిక్ష అనుభవిస్తున్న సజ్జన్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను జైలు అధికారులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.  
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల సవరణ బిల్లుఅలాగే  ఏపీ ఉన్నత విద్య నియంత్రణ,  పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లుకు కూడా శాసనమండలి  ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే..  విద్యారంగంలో ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు సైతం సభ ఆమోదం పొందింది.
 దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన చంద్రబాబు నొక్కి చెప్పారు.  అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను సమర్థవంతంగా అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు  ప్రతిపాదించారు.
హర్మూజ్ జలసంధిలోని దక్షిణ మార్గంలో, ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా నియంత్రణలోని ఈ ప్రత్యేక కారిడార్‌..  సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి  ఇంధన ఉత్పత్తి దేశాల నుంచి చమురు నింపుకున్న ట్యాంకర్లతో పాటు, ఖాళీగా తిరిగొచ్చే నౌకలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తూ రవాణాను సమన్వయం చేస్తున్నది.
ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి,  రేచర్ల బొగ్గు బ్లాకులను ఎంపిక చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ వేలం ప్రక్రియ ద్వారా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఈ రెండు  బొగ్గు బ్లాకులను దక్కించుకుంది.
దాదాపు వెయ్యి కోట్ల రూపాయల  విదేశీ చెల్లింపుల  వ్యవహారంలో పన్ను ఎగవేత, యు అక్రమ నిధుల మళ్లింపు ఆరోపణలపై ఐటీ అధికారులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏకకాలంలో  13 ప్రాంతాలలో సోదాలు చేపట్టారు.  ఈ సోదాల్లో డిజిటల్ ఆధారాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో తన వాటాను 9.99 శాతానికి పెంచుకోవడానికి ఎల్‌ఐసికి ఆర్బీఐ అనుమతి లభించింది. ఈ వార్తతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు ధర 1% పెరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ డోపింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. కొకైన్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ITIA అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్ కప్ పూల్ డి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ 5 3 తేడాతో సంచలన విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో చెలరేగి జట్టుకు ఘన విజయాన్ని అందించిన పూర్తి వివరాలు చూడండి.
బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో పీవీ సింధు, ఆయుష్ శెట్టి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. సాత్విక్ చిరాగ్ జోడీకి వాకోవర్ లభించగా, లక్ష్యసేన్ తీవ్ర పోరాటంలో ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ ఫలితాలు, కీలక గణాంకాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
అంతర్జాతీయ చెస్ రంగాన్ని ఏలుతున్న భారత్! ప్రతిష్టాత్మక సింక్‌ఫీల్డ్ కప్‌లో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించి అగ్రస్థానానికి చేరుకున్న ఆర్. ప్రజ్ఞానంద. మరోవైపు ఆసియాన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అండర్ 11 బాలికల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. పూర్తి వివరాలు చదవండి.
నాసా ప్రతిష్టాత్మక స్విఫ్ట్ గామా-రే టెలిస్కోప్ రెస్క్యూ మిషన్ విఫలమైంది. $30 మిలియన్ల వ్యయంతో చేపట్టిన రోబోటిక్ క్రాఫ్ట్ నియంత్ పిలవకపోవడంతో మిషన్‌ను నాసా రద్దు చేసింది. త్వరలోనే భూ వాతావరణంలో మండిపోనున్న స్విఫ్ట్ టెలిస్కోప్ పూర్తి వివరాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.