ట్రంప్ ఒక్క సంతకం చేస్తే..ఇండియా పరిస్థితి ఏంటీ..?
Publish Date:Apr 18, 2017
Advertisement
సిరియాపై మిస్సల్స్..ఆఫ్గాన్‌పై అతిపెద్ద బాంబు వేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నెక్స్ట్ ఫోకస్ ఇండియాపై పెట్టారు. అమెరికా వస్తువులే కొనాలి..అమెరికా వారినే ఉద్యోగులుగా చేర్చుకోవాలని ఎన్నికల సందర్భంగా చెబుతూ వచ్చిన ఆయన ఉద్యోగాల కోసం అమెరికాలోకి రాకపోకలు సాగించే వారిపై కొరడా ఝళిపించేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం కొత్తగా రూపొందించిన వీసా నిబంధనల ముసాయిదాపై ట్రంప్ సంతకం చేయనున్నారు. దీని ప్రకారం అత్యున్నత నైపుణ్యం ఉన్న వారు మాత్రమే ఇతర దేశాల నుంచి అమెరికాలో అడుగుపెట్టవలసి ఉంటుంది. ఈ నిర్ణయం అమెరికన్లకు బాగానే ఉన్నప్పటికీ..ప్రపంచ దేశాలపై ముఖ్యంగా భారత్‌పై పెను ప్రభావం చూపించనుంది. ట్రంప్ సంతకం చేస్తే అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం..హెచ్1బీ వీసాలను ప్రత్యేక విధులు నిర్వర్తించేందుకు మాత్రమే కేటాయిస్తారు. అంతేకాదు ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉండాలి..శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, కంప్యూటర్ ప్రొగ్రామర్లకు మాత్రం ఎలాంటి పరిమితి లేదు. గతంలో లాగా ఇష్టం వచ్చినట్లు వీసాలు జారీ చేయకుండా వాటిని 65 వేలకు పరిమితం చేసి లాటరీ విధానం ద్వారా కేటాయిస్తారు. విద్యార్థుల కోసం మరో 20 వేల వీసాలను కేటాయించనుంది. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత హెచ్1 బీ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య బాగా పడిపోయింది. గత ఏడాది 2,36,000 ఉన్న ఈ సంఖ్య ఈ సారి 1,99,000లకు పడిపోయింది. ట్రంప్ తమపై కఠినంగా వ్యవహరించడని భావిస్తోన్న భారతీయ ఐటీ కంపెనీలు, విద్యార్థులకు ఆయన నిర్ణయం షాక్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో ఒకసారి చర్చలు జరిపి కొన్ని మినహాయింపులు అడిగే సూచనలు కనిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/donald-trump-45-74059.html





