హర్మూజ్ మాదే.. ట్రంప్.!

Publish Date:Aug 18, 2026

Advertisement

 ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని అమెరికా  భూభాగంగా ప్రకటిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  సంచలన ప్రకటన చేశారు. హర్మూజ్ జలసంధి అమెరికా నూతన భూభాగంగా ప్రకటించిన ట్రంప్ అందుకు సంబంధించి మ్యాప్ ను కూడా విడుదల చేశారు.  తన  సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ వేదికగా ఇందుకు సంబంధించిన  మ్యాప్‌ను ఆయన షేర్ చేశారు. ఇరాన్‌తో కుదిరిన 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం గడువు ముగిసిన మరుసటి రోజే  ట్రంప్ ఈ ప్రకటన చేయడం విశేషం. 

హర్మూజ్ జలసంధిలో అమెరికా పూర్తి నియంత్రణ సాధించిందని ట్రంప్ ఆ పోస్టులో విస్పష్టంగా పేర్కొన్నారు,  అక్కడ సముద్ర మార్గంలో ఇరాన్  గతంలో అమర్చిన   మైన్‌ లు అన్నింటినీ అమెరికా బలగాలు పూర్తిగా తొలగించాయని ట్రంప్ పేర్కొన్నారు.  సరుకు రవాణా నౌకల రాకపోకలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయన్నారు. 

అయితే..  జలసంధిలో సాధారణ రవాణా పునరుద్ధరించినప్పటికీ.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికాదళ దిగ్బంధం యథావిధిగా కొనసాగుతుందనీ, ప్రస్తుతం ఇరాన్ పాలక వర్గంతో   దౌత్యపరమైన చర్చలు జరగడం లేదని, సమీప భవిష్యత్తులో కూడా ఇరాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ట్రంప్ ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు. ట్రంప్ ప్రకటనపై ప్రపంచ దేశాల నుంచి, క్షేత్రస్థాయి పరిశీలకుల నుంచీ  వాస్తవానికి అక్కడ పరిస్థితులు ట్రంప్ చెబుతున్నంత సరళంగా లేవని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా మంగళవారం (ఆగస్టు 18) కూడా ఆ జలసంధి మార్గంలో వెళ్తున్న ఒక భారీ  క్యారియర్ నౌకపై  జరిగిన దాడిలో నౌకలోని పలువురు సిబ్బంది గాయపడ్డారు. 

ఈ  దాడుల నేపథ్యంలో యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఏజెన్సీ ఆ మార్గంలో ప్రయాణించే సరుకు రవాణా నౌకలు, ట్యాంకర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, భద్రతా ప్రమాణాలను కఠినంగా పాటించాలని సూచించింది. ట్రంప్ ప్రకటనల కంటే క్షేత్రస్థాయిలో ఉన్న ప్రమాదకర పరిస్థితులే ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్నాయని రవాణా సంస్థలు భావిస్తున్నాయి.

మరోవైపు ట్రంప్ సోషల్ మీడియా ప్రకటనపై ఇరాన్  ఘాటుగా స్పందించింది. కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఉన్న జలసంధిని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని రిటార్డ్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధి అమెరికా కొత్త భూభాగంగా భావించడం పగటి కలగా పేర్కొంది.   అమెరికా దిగివచ్చే వరకూ హర్మూజ్ జలసంధిని సాధారణ వాణిజ్యానికి సంపూర్ణంగా తెరవడం సాధ్యపడదని  కుండబద్దలు కొట్టింది. 

Donald Trump, Strait of Hormuz, US Iran Tensions, Truth Social Post, Middle East Conflict 

By
en-us Political News

  
ఆగస్టు 19 నాటి బంగారం ధరల పూర్తి వివరాలు. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో 24 క్యారట్లు, 22 క్యారట్ల పసిడి ధరలు ఎంత తగ్గాయో తెలుసుకోండి.
నింటేండో స్విచ్ 2 కోసం డియాబ్లో 4 లాంచ్ డేట్ లీక్ అయింది. సెప్టెంబర్ 15న ఏజ్ ఆఫ్ హేట్రెడ్ కలెక్షన్‌తో $69.99 ధరకు విడుదల కానున్న ఈ గేమ్ వివరాలు, ఎక్స్‌పాన్షన్లు మరియు ఫిజికల్ బాక్స్ సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
ప్రైమ్ వీడియోలో దూసుకుపోతున్న జాక్ రీచర్ సిరీస్‌పై మీకున్న పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి! టామ్ క్రూజ్, అలన్ రిచ్‌సన్ మరియు లీ చైల్డ్ నవలల ఆధారంగా రూపొందించిన ఈ అల్టిమేట్ క్విజ్‌లో 70% స్కోర్ చేయడం నిజమైన అభిమానులకే సాధ్యం.
గూగుల్ తీసుకొస్తున్న సరికొత్త ఏఐ ఫోటోస్కాన్ టెక్నాలజీతో మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా బాడీ ఫ్యాట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవెల్స్ మెడికల్ గ్రేడ్ ఖచ్చితత్వంతో సులభంగా కొలవచ్చు.
ప్రపంచకప్ టోర్నీలో బెల్జియం చేతిలో చేదు ఓటమి తర్వాత సెనెగల్ ఫుట్‌బాల్ జట్టు తమ కోచ్ పేప్ తియావ్‌ను తొలగించి, ఫ్రాన్స్ దిగ్గజం ప్యాట్రిక్ వియెరాను నయా హెడ్ కోచ్‌గా నియమించింది. సెనెగల్ జట్టులో వచ్చిన ఈ సంచలన మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి రూపాయి విలువ 95.73 వద్ద స్థిరపడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల మధ్య ఆర్‌బీఐ సమర్థవంతమైన జోక్యంతో భారత కరెన్సీకి లభించిన ఊరటపై పూర్తి వివరాలు ఇవే!
ఏఐ స్టాక్స్ సుడిగుండంలో చిక్కుకోవడంతో ఆసియా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. కొరియా కోస్పీ 5.2% తగ్గగా, శామ్‌సంగ్, ఎన్‌విడియా సహా దిగ్గజ టెక్ షేర్లు పడిపోయాయి. పెరుగుతున్న చమురు ధరలు, మార్కెట్ నష్టాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
భారతీయ యంగ్ క్రికెటర్ దేవదత్ పడిక్కల్ డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. షెహనాజ్ గిల్ మరియు రియాంజలి నంజప్పతో ఆయనకున్న రూమర్స్, ఐపీఎల్ స్టాండ్స్‌లో జరిగిన సంఘటనలు మరియు క్రికెట్ ప్రదర్శన వివరాలతో కూడిన సమగ్ర కథనం చదవండి.
బైయర్న్ మునిచ్ స్టార్ మిడ్‌ఫీల్డర్ జామల్ ముసియాలా 4 రోజుల్లో 2 సార్లు మైదానంలో కుప్పకూలారు. తనకు న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించిన జర్మనీ ఫుట్‌బాల్ స్టార్. పూర్తి వివరాలు ఇవే!
ఇంగ్లాండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ రికీ పాంటింగ్ ఆల్‌టైమ్ టెస్టు రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం 79 పరుగుల దూరంలో ఉన్నాడు. స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రూట్ సృష్టించబోతున్న చారిత్రాత్మక రికార్డు వివరాలు ఇవే!
గత నెల  25న సీవాన్ ప్రాంతంలోని  జేపీ చౌక్ సమీపంలో  విద్యార్థులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టిన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో విధుల్లో  పోలీస్  అభిషేక్ కుమార్   ఏకే47తో కాల్పులకు తెగబడ్డాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.