మోదీ స్టెప్ డౌన్?

Publish Date:Apr 3, 2025

Advertisement

ప్రధాని నరేంద్రమోడీ తన పదవిని త్యాగం చేస్తారా? పార్టీ నిబంధనను అనుసరించి తనకు 75 సంవత్సరాలు నిండగానే ప్రధాని పదవి నుంచి స్టెప్ డౌన్ అవుతారా? ప్రధాని మోడీ తనకు తాను ఆ నిబంధనను వర్తింప చేసుకుంటారా? అన్న ప్రశ్నలకు రాజకీయ పరిశీలకుల నుంచి అనుమానమే అన్న సమాధానమే వస్తున్నది.  ప్రధానిగా మోడీ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ 75 ఏళ్ల పరిమితి నిబంధన మేరకే బీజేపీ సీనియర్ నాయకులు ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి నాయకుల చేత పొలిటికల్ రిటైర్మెంట్ చేయించారు.  మరి ఇప్పుడు అదే నిబంధన మేరకు మోడీ తనంత తానుగా రాజకీయాలకు దూరమౌతారా? అన్న చర్చ ఇప్పుడు పార్టీలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ లో క ొనసాగుతోంది.  శివసేన (ఉద్ధవ్ ధాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ అయితే త్వరలోనే మోడీ వారసుడు రాబోతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత దశాబ్ద కాలంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లని ప్రధాని నరేంద్రమోడీ  ఇటీవల అంటే గత ఆదివారం నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లడానికి కారణం అదేనని ఆయన అంటున్నారు. 
మోడీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లడానికి ప్రారంభోత్సవమనో, మరోటనో కారణాలు చెప్పి ఉండొచ్చు కానీ, ప్రధాన కారణం మాత్రం తన పదవీ విరమణపై ఆర్ఎస్ఎస్  చీఫ్ మోహన్ భగవత్ తో చర్చించడానికేనని సంజయ్ రౌత్ గట్టిగా చెబుతున్నారు.  మొత్తం మీద సంజయ్ రౌత్ మోడీ స్టెప్ డౌన్ పై ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసినా, ఆయన వ్యాఖ్యలు ఒక్క సారిగా దేశంలో రాజకీయ హీట్ పెంచేశాయని చెప్పక తప్పదు. అదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలను గట్టిగా ఖండించారు.  మోడీయే 2029లో కూడా ప్రధానిగా ఉంటారని ఢంకా బజాయించి మరీ చెప్పారు. ప్రధానిగా మోడీ యాక్టివ్ గా ఉన్నారనీ, అటువంటి సమయంలో ఆయనకు ప్రత్యామ్నాయం గురించి మాట్లాడటంతో అర్ధం లేదనీ ఫడ్నవీస్ అంటున్నారు.  ప్రధాని మోడీ నాగపూర్ ఆర్ఎస్ఎష్ కార్యాలయం సందర్శన సందర్భంగా ఆయన రాజకీయ వారసుడికి సంబంధించి ఎటువంటి చర్చా జరగలేదనీ, అసలా ప్రస్తావనే రాలేదనీ ఆర్ఎస్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి.  

అయితే ఏడున్నర పదుల వయస్సు నిండిన నేతల రాజకీయ విరమణ అంశంపై బీజేపీలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశాలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలెవరికీ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా నోరెత్తే అవకాశం ఇసుమంతైనా లేదు. గతంలో  అడపాదడపా పార్టీ నాయకుడు ఎలా ఉండాలి అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినా, ఇప్పుడు ఆయన నాయకత్వం మార్పుపై కానీ, 75 ఏళ్ల నిండిన వారు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించాలన్న విషయంపై కానీ మాట్లాడే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.  

ఇప్పుడు పార్టీలో మోడీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్నప్పటికీ.. ఆయన తరువాత ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం కోసం అటు ఆర్ఎస్ఎస్, ఇటు బీజేపీ కూడా ఎదురు చూస్తున్నాయనడంలో సందేహం లేదు.  నితిన్ గడ్కరీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లలో ఎవరో ఒకరు మోడీ తరువాతి స్థానం అంట నంబర్ 2లో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనీ, ఆ నంబర్ 2 యే మోడీ వారసుడన్న ప్రచారం జరుగుతోంది. 

ఇప్పుడే కాదు. మోడీ రెండో సారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ యోగి ఆదిత్యనాథ్ రూపంలో ఆయన పోటీ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ, షా ద్వయం యోగి పట్ల అంత సదభిప్రాయంతో లేరనీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు అదే కారణంతో ఆర్ఎస్ఎస్ మాత్రం యోగికి మద్దతుగా నిలబడుతోందని అంటున్నారు. 

హిందుత్వ భావాలను ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తం చేయడం, ప్రచారం చేయడం ద్వారా యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ గుడ్ లుక్స్ లో ఉన్నారు. అంతే కాకుండా తనదైన ప్రత్యేక   శైలితో శాంతి భద్రతలను పరిరక్షించడం ద్వారా యోగి పార్టీ నేతలు, క్యాడర్ నుంచి గట్టి మద్దతు సాధించారనీ అంటున్నారు.  అన్నిటికీ మించి యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచే వచ్చారు. పలు సందర్భాలలో య ోగి తాను పదవులు ఆశించననీ, యూపీ సీఎంగా తనది పార్ట్ టౌం జాబ్ మాత్రమేనని పలు సందర్భాలలో యోగి చెప్పారు.  

By
en-us Political News

  
భారతీయ జనతా పార్టీలో ఏమి జరగుతోంది? జాతీయ అధ్యక్షుని ఎన్నికలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది? తెలంగాణ సహా అనేక ఇతర రాష్ట్రల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ఎందుకు ముడిపడడం లేదు? అందుకు పార్టీ నేతలు చెపుతున్న కారణాలేనా లేక ఇంకా లోతైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే, కమల దళంలో జరుగతున్న పరిణామాల వెనక లోతైన కారణాలే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అంటే కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఉన్న అభిప్రాయం ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకటి రెండు సార్లు కాదు.. వందల సార్లు రాహుల్ గాంధీ ఐ హేట్ ఆర్ఎస్ఎస్ అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆఫ్కోర్స్, ఆయన అవే పదాలను, అదే క్రమంలో అని ఉండక పోవచ్చును, కానీ ఎప్పుడు ఎక్కడ, ఎలాంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన వచ్చినా.. రాహుల్ గాంధీ తన వ్యతిరేకతను, ద్వేషాన్నీ ఎప్పుడూ దాచుకోలేదు.
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. ముంబై నటి జత్వానీ కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. బేగంపేటలోని ఆయన నివాసంలో అదుపులోనికి తీసుకుని విజయవాడకు తరలించారు. ప్రస్తుతం సస్సెన్షన్ లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు జగన్‌ హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ విషయంలో నగదు లావాదేవీల వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొంది.
ఓ వైపు తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మరో వైపు శ్రీవారి మెట్ల నడకమార్గంలో భక్తులు పొటెత్తుతున్నారు. ఇదే అదునుగా భక్తులను ఆటోవాలాలు నిలువుదోపిడీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెడిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(ఏపీఎస్ డబ్ల్యేఆర్ఇఐఎస్) సెక్రటరీ, ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేణ్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి పురస్కారాన్ని అందుకున్నారు. 2023 సంవత్సరానికి సంబంధించి ఈ పురస్కారాన్ని ఆయన ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అందుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (ఏప్రిల్ 22)ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు.
500 రూపాయల నోట్లపై కేంద్ర హోంశాఖ సంచలన ప్రకటన చేసింది. నకిలీ నోట్ల విషయంలో ఎన్ఐఏ, డీఆర్ఐ, సీబీఐ, సెబీ సహా అనేక శాఖలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. నకిలీ నోట్లకు ఒరిజినల్ నోట్లకు తేడా అస్సలు గుర్తించ లేకుండా ఉన్నాయనీ, అప్రమత్తంగా ఉండానీ ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ మద్యం లిక్కర్ కుంభకోణం కేసులో సోమవారం అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో, ఇప్పటికి నాలుగు సార్లు నోటీసులు అందుకుని కూడా సిట్ విచారణకు గైర్హాజరై తప్పించుకు తిరుగుతున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు సోమవారం (ఏప్రిల్ 21) అరెస్టు చేశారు.
పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారంటూ నమోదైన కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన్ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో మాధవ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.ఏప్రిల్ 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు మాధవ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు రోజుల పాటు గుంటూరు పోలీసులు గోరంట్ల మాధవ్‌ను అదుపులోకి తీసుకుని, కేసు వివరాలపై లోతుగా విచారించనున్నారు.
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొన్నాది. అన్ని పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుందని తెలిపింది. వీటికి సంబంధించిన హాల్ టికెట్లను httpps://psc.ap.gov.in అధికారిక వెబ్సైట్ లో నేటి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఏపీలో మొత్తం 81 గ్రూప్‌ -1 పోస్టుల భర్తీకి గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌‌ఫోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. తాను రేపు విచారణకు హాజరవుతానని వారికి ఆయన తెలిపారు. అయితే, హాజరవుతారో లేదోనని అనుమానంగా ఉందని, తమ వెంట రావాల్సిందేనని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిపోయారు. మరికాసేపట్లో అతడిని విజయవాడ తరలించనున్నారు. మరోవైపు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్‌ కసిరెడ్డి, హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు.
బంగారం ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్. ఇక పసిడి కోనుగోలు చేయాలంటే సామాన్య ప్రజలకు మరింత కష్టతరం అవుతోంది. రోజురోజుకి గోల్డ్ రేటు అకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బంగారం ధరకి మరోసారి రెక్కలు వచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర పన్నులతో కలిసి అక్షరాల లక్ష రూపాయిలను తాకింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సోమవారం ఉదయం రూ.98,350 ఉన్న24 క్యారెట్ల గోల్డ్ తులం రేటు సాయంత్రం 5.30 గంటల సమయానికి రూ.1,00,016కు చేరింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు రూ.2వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు 3,393 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా- చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేంతవరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.