ప్రతిభకు-ప్రవర్తనకు గల సంబంధం తెలుసా?

Publish Date:Mar 19, 2025

Advertisement

వర్తమానంలో  మనిషి నిలకడగా ఉండకపోవడానికి ఉన్న పెద్ద కారణాలలో గతంలోకి తొంగి చూస్తూ ఉండటం ముఖ్యమైనది.  గతంలో ఎన్నో పరాజయాలు ఎదురై ఉండవచ్చు. కానీ, వాటిని వేటినీ పట్టించుకోకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలో పొరపాట్లు, పరాజయాలు సర్వసాధారణమే. అవి మీ జీవితానికి మెరుగులు దిద్దేవే! ఓటములే లేని జీవితం ఎంత నిస్సారంగా ఉంటుందో తెలుసా! అలాంటి జీవితంలో నేర్చుకోవడానికి ఎవరికీ ఏమీ లభ్యం కాదు. కేవలం కాలంతో ఊరికే అట్లా నడుస్తూ పోవడం అనేది మొదట్లో సుఖవంతంగా అనిపిస్తుందేమో కానీ అది తరువాత ఒక పెద్ద చిరాకుగానూ శూన్యంతో నిండినట్టుగానూ అనిపిస్తుంది. 


అలాంటి శూన్యమే మనిషిలో నిస్సహాయత, నిరాశ వంటి వాటిని పొగుచేస్తుంది. ఏదీ చేయలేకపోతున్నామే అనే ఆందోళన, కలవరపాటు చోటుచేసుకుంటుంది. వాటినే కష్టాలనీ, అవి ఎంతగానో బాధిస్తున్నాయని భ్రమ పడుతూ ఉంటారు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే.. సమస్య తెచ్చిపెట్టుకున్నది, ఆ తరువాత దాని వల్ల ఇబ్బంది పడి బాధపడుతున్నది కూడా మనిషే… అలాంటప్పుడు ఎవరైనా సహాయం చేస్తారేమో అని దిక్కులు చూస్తారు. కానీ అది తప్పు.   Pull yourself out of difficulties by your- self. There is none to help you... కష్టాలనూ, కడగండ్లనూ స్వశక్తితోనే అధిగమించండి.


చాలా మందికి ఇతరుల ముందు చాలా కఠినంగా ఉంటారు.  ముఖ్యంగా ప్రతి చిన్నదానికీ ఇతరులను నిందించడమంటే మహా సరదా.. అలాంటి మనస్తత్త్వాన్ని విడనాడాలి. ఎవరి సమస్యలకు వారే కారణం అయినప్పుడు వాటికి ఇతరులను బాద్యులను చేయడం తప్పు. పైపెచ్చు ఇతరులను నిందించడం వల్ల ఎదురయ్యే పరాభవాలు, పరాజయాలు తోడయ్యి మనిషికి విలువను తగ్గిస్తుంది.   అది మనిషిని ఉన్నతస్థానం నుంచి నీచస్థాయికి దిగజారుస్తుంది. అందుకే మనిషిలో ఉన్న ఆ దుర్గుణాన్ని మెల్లగా తుంచేయాలి. 


జీవితంలో ఎద్గురయ్యే వైఫల్యాలనూ, తప్పిదాలనూ ఎదుటి వ్యక్తులపైనో, సమాజంపైనో వేసి పరిస్థితుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. పలాయనవాదులుగా, పరాన్నభుక్కులుగా మిగిలిపోతున్నారు. పరీక్షల దగ్గర నుంచి వివాహ వ్యవహారాల వరకు ప్రతి విషయంలో ఇలాంటి పరిస్థితులలోకి వెళ్ళిపోయి అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుఃస్థితి నుంచి బయటపడటం చాలా ముఖ్యం. 

రాజ్యాలు, వైభవాలు, యుద్ధాలు, విజయాలు ఇవేవీ నిజానికి చరిత్ర కాదు! అద్భుతాలను సాధించిన కొందరు మహాపురుషుల జీవనప్రవాహమే చరిత్ర. ఆత్మవిశ్వాసం ఆ మహానుభావుల హృదయాలలో ప్రకాశించింది. నాగరకత అభివృద్ధిలో వారిని ముందుకు తీసుకువచ్చిన క్రియాశక్తి ఏదైనా ఉందంటే అది ఈ ఆత్మవిశ్వాసమే! మనకు ఏదైనా నష్టం, దోషం సంభవించాయంటే  అవన్నీ కూడా మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన నాటి నుంచే ప్రారంభమయ్యాయి. ప్రపంచం అభివృద్ధి చెందుతుంది కానీ.. నేటికీ మనిషి ఎక్కడో అలాంటి తప్పటడుగులే వేస్తున్నాడు. ఆత్మవిశ్వాసాన్నీ, ఆత్మాభిమానాన్నీ కోల్పోయి అభివృద్ధి పేరుతో, ఆధునికత పేరుతో సానుకూలం కాని సరంజామాను జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ రోజుల్లో అన్నీ తెలిసినా, కర్ణుడి శస్త్రజ్ఞానంలా అవసరానికి అవి ఉపయోగపడడం లేదు.


ఇప్పటి యువతలో సామర్థ్యానికి కొదవలేదు. సౌశీల్యమే కొరవడింది. సామర్థ్యం మనిషిని ఉన్నతస్థాయికి తీసుకువెళుతుంది. కానీ, సౌశీల్యం మనిషిని ఆ ఉన్నతస్థానంలో శాశ్వతంగా ఉంచుతుంది. నేడు సమాజంలో ఎన్నో ఉన్నతస్థానాలను అధిరోహించ గలుగుతున్నా, అక్కడి నుంచి కొన్నాళ్ళకే పతనమైపోవడానికి కారణం  ప్రతిభకు తగ్గ ప్రవర్తన లేకపోవడమే! ఈ ప్రవర్తన ఎంత ముఖ్యమో తెలుసుకున్నవాడు మెట్టు దిగజారకుండా పటిష్టమైన కోటను కట్టుకుంటాడు. కానీ ప్రవర్తన సరిగ్గా లేనివాడు తనకు తానే వైఫల్యాలను కొనితెచ్చుకుని పేకమేడలా కూలిపోతాడు. అందుకే ప్రతిభకు తగిన ప్రవర్తన అలవరచుకుని మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మారాలి. ఆ దిశగా అడుగులు వేయాలి.


                                      ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.