వైసీపీలో అసంతృప్తి.. నేతల్లో ఆందోళన

Publish Date:Dec 31, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు, చేయని ప్రయత్నం లేదు. నిజానికి, ఓటమి అంచున నిలిచినా , దింపుడు కళ్ళెం ఆశతో ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడంలేదు. తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లు గెలవాలని కోరుకుంటున్నారు. కోరుకోవడం కాదు, 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేం అనే లక్ష్యంతో ముందుకు సాగండి అంటూ, అతి విశ్వాసాన్ని ఉద్భోదిస్తున్నారు. ఎమ్మెల్యేలను గడప గడపకు వెళ్లి, ప్రతి ఫ్యామిలీకి చేసిన మేళ్లను చెప్పుకోవాలని, తరుము తున్నారు. అయితే నిజంగా ప్రతి గడపకు మేలు జరిగిందే నిజం అయితే, ఇంతలా హైరాన పడడం ఎందుకు? అంటూ అటు ప్రజలు, ఇటు ప్రతి పక్ష నాయకులు, కార్యకర్తలు కూడా నవ్వు కుంటున్నారనుకోండి అది వేరే విషయం.  

అలాగే చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కని పాలన జరుగుతోందని    జగన్మోహన్ రెడ్డి  తనకు తాను తగిలించుకున్న భుజ కీర్తులను ఎత్తి చూపుకుంటున్నారు.  ఎన్నికల మేనిఫెస్టోలో 98 శాతానికి పైగా హామీలను నెరవేర్చామని  చేసిన పనులను గడపగడపకు ప్రజల వద్దకు తీసుకెళ్లడి చాలు అంటూ కార్యకర్తలలో విశ్వాసం కలిగించేందుకు చాలా చాలా శ్రమిస్తున్నారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాన్ని(అతి ఎంత అక్రమ విజయమో వేరే చెప్పనక్కరలేదు) భూతద్దంలో చూపించి తెలుగు దేశం అధినేత్ చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం  కుప్పంలోనే గెలిచి నప్పుడు, మిగిలిన  నియోజక వర్గాల్లో గెలవడం ఎంత పని,  175కు 175 నియోజక వర్గాల్లోనూ గెలుస్తాం ..  గెలుస్తున్నాం .. అంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. అయితే, జగన్ రెడ్డి కుప్పం గెలుపును ప్రజాస్వామ్య విజయంగా చెప్పుకోవడం  అది చూసి తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరుకోవడం, తల్లి తండ్రులను హత్య చేసిన హంతకుడు,  తల్లి తండ్రులు లేని అనాధను కరుణించి కాపాడండని న్యాయస్థానాన్ని వేడుకున్నట్లు ఉందని అంటున్నారు. 

నిజమే అద్దాల మేడలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి పగటి కళలు కంటే కనవచ్చును, కానీ, వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో మాత్రం  ఆ భరోసా కనిపించడం లేదు. గతంలో   అభ్యర్ధి ఎవరైనా,   అన్నకు ఓటేయండి.. అన్నను అధికారంలోకి తీసుకువద్దాం!`` అని, అన్ని నియోజక వర్గాల్లో జగన్ రెడ్డే, వైసీపీ అభ్యర్ధి అన్నట్ల్గు  ప్రచారం చేసిన కార్యకర్తలు, ఇప్పుడు మౌనంగా ఉండి పోతున్నారు. జగన్ రెడ్డి ఏమి చేశారంటే, చెప్పేందుకు సమాధానం లేక గడపగడప కర్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు  2019 ఎన్నికల్లో వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి వైసీపే వెంట నడిచిన వైసీపీ కార్యకర్తలు చాలా వరకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  98 శాతం వరకు ఇచ్చిన హమీలను నేరవేర్చామని చెప్పుకోవడం, అమ్మకు అన్నం పెట్టనోడు, పిన్నమ్మకు వడ్డాణం చేయించానన్నట్లుగా ఉందని కార్యకర్తలే వాపోతున్నారు. ప్రజల సంగతి తర్వాత, కార్యకర్తలకు ఇచ్చిన హమీలకే దిక్కు లేదని నేతలను నడిరోడ్డు మీద నిలదీస్తున్నారు. 

అలాగే కులం, మతం ఇతర ఇంటర్నల్ లింకుల కారణంగా ఇంకా వైసీపీని మోస్తున్న కార్యకర్తలు అయితే, ఇక ఇప్పడు చేయగలిగిందేమీ లేదనీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వాపోతున్నారు.  మరో వంక నాయకుల్లోనూ ఇంతకాలం అణచి పెట్టుకున్న అసంతృప్తి  అగ్నిగోళంలా భగ్గుమంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తుపాకిలోంచి  తూటాలా ధిక్కారం దూసుకోస్తోంది. ప్రతి జిల్లా, ప్రతి నియోజక వర్గంలోనూ కనీసం ఇద్దరు ముగ్గురు నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. 

ఉమ్మడి కృష్ణాను తీసుకుంటే.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను, గుంటూరులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నెల్లూరులో కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మానుగుంట మహీధర్ రెడ్డి,   ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, తాడికొండ లో ఉండవల్లి శ్రీదేవి,  కర్నూలులో  ఎస్వీ మోహన్ రెడ్డి    రాజంపేటలో మేడా మల్లికార్జున రెడ్డి, రాయచోటిలో  శ్రీకాంత్రెడ్డి,  గిద్దలూరులో అన్నా రాంబాబు బాపట్లలో కోన శశిధర్,  శ్రీకాకుళం కిల్లి కృపారాణి, పేరాడ తిలక్.. ఇలా.. కీలక నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఒకరిద్దరు మినహా వీరంతా కూడా   ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెంట నడిచిన వారే, అయన విజయం కోసం కష్టపడిన వారే. ఆయన కోసం.. ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకున్నవారే. అప్పులు చేసి మరీ ఖర్చు చేసిన వారే. అయితే..ఇప్పుడు వీరికి ప్రాధాన్యం లేకుండా పోవడం.. జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడం.. వారు ఆధిపత్య ధోరణితో ముందుకు సాగడం వంటివి ఇప్పుడు వీరిని మనోవేదనను కలిగిస్తున్నాయి. దీనికి తోడు.. నియోజకవర్గాల్లో అభివృద్ధిలేక పోవడం కూడా.. వారిని తీవ్ర సంకట స్థితికి చేర్చింది. దీంతో ఎక్కడికక్కడ నిరసనలు పెరుగుతున్నాయి.

నిజానికి, వైసీపీలో ఏ ఇద్దరు కలిసినా ... జగన్ రెడ్డి మాటలకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన లేదనే విషయాన్నే చర్చించుకుంటున్నారు. ఇటు కార్యకర్తల్లో, అటు నాయకుల్లోనూ భగ్గుమనేదుకు సిద్డంగా ఉన్న అసంతృప్తి గురించే మాట్లాడు కుంటున్నారు. నిజానికి ఇప్పటికే చాల వరకు జిల్లాల్లో అసంతృప్తి కర్యకలాపాలు జోరందుకున్నాయి... ఎన్నికలు దగరయ్యే కొద్దీ పార్టీలో కింది నుంచి పైవరకు ఉన్న అసంతృప్తి భగ్గుమంటోందని, వైసీపీ ముఖ్య నేతలు సైతం అంగీకరిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేందుకు  వెనకాడుతున్నారు.. పిల్లి మేడలో గంట కట్టేది ఎవరని వేచి చూస్తున్నారు.

By
en-us Political News

  
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.