మునుగోడు టీఆర్ఎస్ లో ముసలం

Publish Date:Aug 13, 2022

Advertisement

మునుగోడు టీఆర్ఎస్ లో అసమ్మతి పతాక స్థాయికి చేరింది. మునుగోడు ఉప ఎన్నికకు ముందు నియోజకవర్గ టీఆర్ఎస్ అసంతృప్త నేతల రహస్య సమావేశం కలకలం రేపింది. ఈ రహస్య సమావేశానికి నియోజకవర్గం నలుమూలల నుంచీ దాదాపు 300 మంది నేతలు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి వ్యతిరేకంగా ఈ సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. ప్రభాకరరెడ్డికి వినా ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం మనస్ఫూర్తిగా సహకరిస్తామని అసంతృప్త నేతలు అంటున్నారు. అయితే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి పార్టీ టికెట్ ఖరారు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లెదని అసమ్మతి నేతలు అంటున్నట్లు సమాచారం. ఈ రహస్య సమావేశం నేపథ్యంలో పార్టీ అగ్ర నాయకత్వం అప్రమత్తమైంది.  

అసమ్మతులను బుజ్జగించే బాధ్యతను మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగించింది. అయితే ఆయన అసమ్మతి నేతలతో జరిపిన చర్చలు ఫలించలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినా ప్రభాకరరెడ్డి విషయంలో రాజీ పడేది లేదని వారు భీష్మించినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దండు మల్కాపూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో అసమ్మతి నేతలు సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు ఉపఎన్నిక ను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో నియోజకవర్గ కారు పార్టీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమనడం పార్టీకి  మింగుడుపడటం లేదు.  

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.  ఈ ఉప ఎన్నికను బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కూడా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో త్రిముఖ పోరు హోరాహోరీగా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో ఒక్కసారిగా అసమ్మతి జ్వాలలు రేగడం ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికరమేనని అంటున్నారు.

 మునుగోడు ఉప ఎన్నికలో విజయం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమదే అధికారం అని చాటుకోవాలన్న లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు సర్వ శక్తులూ ఒడి మునుగోడును దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో అసమ్మతి సెగలు ఆ పార్టీని డిఫెన్స్ లో పడేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.