తేనెకళ్ల సుందరి, మహాకుంభమేళా మోనాలిసాకు సినిమా చాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించి ఓవర్ నైట్ సెలెబ్రిటీగా మారిపోయిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిత్రా ఇప్పుడు మరో కారణంతో పాపులర్ అయ్యాడు. అత్యాచారం, అసభ్య వీడియోలు తీసి బెదరించడం ఆరోపణలపై అరెస్టై మరో సారి వార్తల్లో నిలిచాడు.
ఈ ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేలాలో.. జీవనోపాధి కోసం పూసల దండలు అమ్ముకుంటున్న ఓ యువతి కుంభమేళా మోనాలిసాగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆమెను అంతా తేనెకళ్ల సుందరి, మహాకుంభ్ మోనాలిసా అంటూ పిలవడం మొదలు పెట్టారు. దీంతో బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తన కొత్త సినిమా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ లో నటిగా ఎంపిక చేసుకున్నాడు.
మోనాలిసాకు సినీ చాన్స్ ఇచ్చి సనోజ్ మిశ్రా కూడా దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఆ పాపులారిటీ మసకబారిది. అత్యాచారం, అసభ్య వీడియోలు చిత్రీకరించి ఓ యువతిని వేధించిన కేసులో అరెస్టయ్యాడు. విషయమేంటంటే.. ఉత్తరప్రదేశ్ లోని 'ఝాన్సీ'నగరానికి చెందిన ఒక యువతి సనోజ్ మిశ్రా తనకు 2020 లో టిక్ టాక్,ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడనీ, సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని నమ్మించాడనీ, ఆ తర్వాత రిసార్ట్ కి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి అసభ్య వీడియోలు చిత్రీకరించాడు.ఆ వీడియో లను చూపుతూ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసాడనీ, పెళ్లి చేసుకుంటానని ప్రమాణాలు చేసి మోసం చేశాడనీ ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు సనోజ్ మిశ్రాను అరెస్టు చేశారు. 2014 లో బేతాబ్ తో దర్శకుడిగా పరిచయమైన సనోజ్ మిశ్రా 'గాంధీగిరి, రామ్ కి జన్మ భూమి, లఫంగే నవాబ్,శ్రీనగర్,ది డైరీ ఆఫ్ బెంగాల్ వంటి చిత్రాలు తీశాడు. ఆయన తాజా చిత్రం కాశీ టూ కాశ్మీర్ విడుదలకు సిద్ధంగా ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/director-who-gave-cinema-chance-to-maha-kumbh-monalis-arrested-25-195362.html
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!