కాంగ్రెస్ లో లుకలుకలు.. స్టార్ క్యాంపెయినర్ జాబితాలో శవిథరూర్ కు దక్కని చోటు

Publish Date:Nov 16, 2022

Advertisement

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లికార్జున్ ఖర్గే చేపట్టిన తరువాత కూడా పార్టీలో జి23 నేతల ప్రభావంపై పార్టీలో ఆందోళన ఇసుమంతైనా తగ్గలేదు.  పైపెచ్చు వారికి  పార్టీలో ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు.

తద్వారా పొమ్మన లేక పొగపెట్టిన చందంగా వారంతట వారే బయటకు వెళ్లే పరిస్థితి కల్పిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో.. అంటే సోనియా గాంధీ అధినేత్రిగా ఉన్న సమయంలో ఆమె నిర్ణయాలను ప్రశ్నించిన సీనియర్లను పక్కన పెట్టిన సంగతిని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. వారిలో గులాం నబీ ఆజాద్ ఆయనంతట ఆయనగా పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్న సంగతి విదితమే.

ఇప్పుడు కాంగ్రెస్ లో ఆ పరిస్థితి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కు ఎదురౌతున్నట్లుగా కనిపిస్తున్నది.  తాజాగా పార్టీ అధ్యక్ష ఎన్నికలో మల్లికార్జున్ ఖర్గేకు పోటీగా నిలబడి పరాజయం పాలైన శశిథరూర్ కు అవమానం ఎదురైంది. గుజరాత్ అసెంబ్లీ  ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రాజకీయ పార్టీలు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ కూడా ఆ రాష్ట్రంలో బాగా పుంజుకుందని సర్వేలు చెబుతున్న   వేళ  గ్రాండ్ ఓల్డ్ పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్‌ నేత శశిథరూర్‌కు పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో స్థానం దక్కలేదు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ సీనియర్లు పార్టీ అధ్యక్షుడి తీరును తప్పుపడుతూ   పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే.

ఇలాంటి తరుణంలో శశిథరూర్‌కు స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో స్థానం కల్పించకుండా అవమానించడం ద్వారా పార్టీ ఆయనకు బయటకు దారి చూపిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో శిశిథరూర్ కు స్థానం కల్పించకపోయినా గుజరాత్ లో ప్రచారానికి రావాల్సిందిగా ఆ రాష్ట్ర విద్యార్థి సంఘం ఆయనను ఆహ్వానించింది. అయితే వారి ఆహ్వానాన్ని శశిథరూర్ మన్నించలేదు. ఇక, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 40 మందితో​ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్ల  జాబితాను విడుదల చేసింది.  ఆ జాబితాలో  పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్‌ సీఎం అశోక​్‌ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌, దిగ్విజయ్‌ సింగ్‌, కమల్‌నాథ్‌, సచిన్‌ పైలట్‌, కన్హయ్య కుమార్‌, అశోక్‌ చవాన్‌, తదితరులు ఉన్నారు.

మరో వైపు రాజస్థాన్ లోనూ పార్టీలో లుకలుకలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ పదవికి పార్టీ సీనియర్ నేత అజయ్ మకేన్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు ఆయన చెబుతున్న కారణం.. ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు మద్దతుగా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై   పార్టీ అధిష్ఠానం   చర్యలు తీసుకోకపోవడమే అంటున్నారు. తన రాజీనామా లేఖను మకేన్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపినట్లు చెబుతున్నారు.  గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్ అధ్యక్షు ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధపడిన అశోక్ గెహ్లాట్   స్థానంలో మరో వ్యక్తిని ఎన్నుకునేందుకు కీలక సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ గెహ్లాట్ విధేయులైన 90 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆ సమావేశానికి గైర్హాజరై తన ధిక్కారాన్ని వ్యక్తం చేశారు.

సీఎం పదవి నుంచి గెహ్లాట్‌ను తప్పించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమ రాజీనామా పత్రాలను సమర్పించేందుకు స్పీకర్ వద్దకు వెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఎమ్మెల్యేలు మహేష్ జోషి, ధర్మేంద్ర రాథోర్, శాంతి ధరివాల్‌ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అజయ్ మాకెన్ అధిష్ఠానానికి సిఫారసు చేశారు. అయితే, ఇంతవరకూ వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడంపై అజయ్ మాకెన్ కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నారు.

దానికి తోడు ఇప్పడు గెహ్లాట్ కు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు కల్పించడంతో మాకేన్ రాజీనామా చేశారని అంటున్నారు. రాజస్థాన్‌లో రాజకీయ అస్థిరతకు చరమగీతం పాడాలంటూ రెండు వారాల క్రితం సచిన్ పైలట్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మకేన్ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజస్థాన్‌లోని వచ్చే నెల ప్రారంభంలో భారత్ జోడో యాత్ర రానుండటం, డిసెంబర్ 4న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మకేన్ రాజీనామా పార్టీని సంక్షోభంలోకి నెట్టేసినట్లైంది. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.