పశ్చిమ బెంగాల్.. అయినా పరిస్థితులు మారలేదు!

Publish Date:Feb 17, 2023

Advertisement

పశ్చిమ బెంగాల్ లో గవర్నర్ మారినా.. పరిస్థితుల్లో ఇసుమంతైనా మార్పు కనిపించలేదు. గవర్నర్- ముఖ్యమంత్రి మధ్య విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి. పాత గవర్నర్ స్థానంలో కొత్త గవర్నర్ వచ్చినా ప్రభుత్వం- గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి మాత్రం అలాగే కొనసాగుతోంది.   గవర్నర్ గా  జగదీప్‌ ధనకర్‌ ఉన్నప్పుడు రాష్ట్రంలో నిత్యమూ ఘర్షణ పూర్వక వాతావరణమే కనిపించేది. గవర్నర్‌ ధన్‌కడ్‌, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య సఖ్యత సంగతి పక్కన పెడితే నిత్యం ఉప్పు నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ ఉండేవారు.

ధన్ కడ్ గవర్నర్ గా ఉన్నంత కాలమూ.. ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం కూడా ఇరువురి మధ్యా సామరస్యపూరిత వాతావరణం ఉన్న దాఖలాలు లేవు. అయితే మమతకు ఊరట కలిగించేలా ధన్ కడ్   ఉప రాష్ట్రపతిగా ధన్‌కడ్‌   బాధ్యతలు స్వీకరించారు. ధన్ కడ్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా వ్యవహరించిన తీరు కారణంగానే మోడీ ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించారని పరిశీలకుల విశ్లేషణలు పక్కన పెడితే ఆయన రాష్ట్రం నుంచి వెళ్లిపోవడంతో మమత ఊపిరి పీల్చుకున్నారనే చెప్పారు.  ఆయన స్థానంలో  1977 ఐఏఎస్‌ కేడర్‌కు చెందిన  సీవీ ఆనంద్ ను పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా మోడీ ఏరి కోరి ఎంపిక చేసి మరీ పంపించారు. గత ఏడాది  నవంబర్‌లో సీవీ ఆనంద్ బోస్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి నాళ్లలో గవర్న్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ మధ్య సుహృద్భావ పూరిత వాతావరణమే ఉండింది.

మమత రచనలు, పెయింటింగ్లు, సంగీత కంపోజిషన్లు, అల్బమ్ లపై గవర్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే మమతా బెనర్జీ సైతం ఆయనకు ఎంతో ప్రీతిపాత్రమైన రసగుల్లాలను బహుమతిగా ఇచ్చారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ మమత ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని ఇటీవలి బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ఆనంద్ బోస్ అక్షరం పొల్లుపోకుండా చదివారు.  ముఖ్యంగా ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఏ, పీఎంఏవై నిధుల విషయంలో కేంద్రాన్ని తప్పుపడుతూ ఉన్న భాగాలను కూడా ఆయన అక్షరం పొల్లుపోకుండా చదివేశారు.  

అయితే ఇటీవల ఆయన వైఖరి మారింది. అందుకు కారణం ఆయన వ్యవహార శైలి పట్ల కేంద్రం కన్నెర్ర చేయడమేనని సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ గవర్నర్ లో భేటీ అయ్యారు. వీరి మధ్య ఈ భేటీ దాదాపు రెండు గంటలకు పైగా జరిగింది. సాధారణంగా గవర్నర్ అంత సేపు ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వరు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఇచ్చారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ భేటీ తరువాత నుంచే గవర్నర్ వైఖరిలో మార్పు వచ్చిందని పరిశీలకులు సైతం చెబుతున్నారు.

ఆ భేటీ తరువాత లోకాయక్త నియామకం విషయంలో గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగేలా వ్యవహరించారు. ప్రమాణ స్వీకారం సైతం చేయలేదు. పైగా లోకాయుక్త నియామకం ఉత్తర్వులలో చట్టపరమైన లొసుగులు ఉన్నాయని ఆరోపణలు సైతం చేశారు. ఆ వెంటనే తనకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న మమతా బెనర్జీకి సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన నందినీ చక్రవర్తికి గవర్నర్ ఉద్వాసన పలికారు. దీంతో పశ్చిమ బెంగాల్ లో గవర్నర్- ప్రభుత్వం మధ్య సంబంధాలు మళ్లీ మొదటికి చేరుకున్నాయి.  

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.