బరువు తగ్గడానికి, శరీరంలో కొవ్వు తగ్గడానికి మధ్య తేడాలు తెలుసా?

Publish Date:Jun 19, 2024

Advertisement

 

ఫిట్‌నెస్ గురించి మాట్లాడే చాలామంది బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్న వారై ఉంటారు. వీరు బరువు తగ్గడం,  తీసుకునే ఆహారం గురించి తరచుగా చర్చిస్తూ ఉంటారు. కొందరు పొట్ట తగ్గడానికి, మరికొందరు బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చాలా అరుదుగా శరీరంలో కొవ్వు తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు.   అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఇలా బరువు తగ్గడం, శరీరంలో కొవ్వు తగ్గించుకోవడం వేర్వేరు విషయాలని.  శరీరంలో కొవ్వు తగ్గడం వల్ల శరీరం ఫిట్ గా మారుతుంది. కానీ బరువు తగ్గడం అనేది శరీరంలో కండరాలకు అస్సలు మంచిది కాదు.  ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకుంటే..


కొవ్వు తగ్గడం అంటే శరీరంలో నిల్వ ఉండే అదనపు కొవ్వును తగ్గించడం. కొవ్వు కండరాల చుట్టూ పొర రూపంలో పేరుకుపోతుంది.  దానిని తగ్గించడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. కానీ కండరాల నష్టం అంటే కండరాలు తగ్గుతాయి. మన శరీర బలం,  స్థిరత్వం కాపాడుకోవడంలో కండరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే కండరాలకు  నష్టం కలిగితే అది  ఆరోగ్యానికి మంచిది కాదు.

బరువు తగ్గడం అంటే కొవ్వు తగ్గడం. కొవ్వును తగ్గించడానికి కేలరీల తీసుకోవడం తగ్గించాలి. శరీరంలో  కొవ్వును కోల్పోతే  కండరాలు అవసరమైన కేలరీలను పొందలేకపోవచ్చు. కొవ్వు తగ్గడం, కండరాలు పెరగడం ఒకేసారి జరుగుతుందా అనే సందేహం ప్రజల్లో ఉంటుంది.


బరువు తగ్గడం కోసం  క్యాలరీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు.  అంటే శరీరంలో క్యాలరీల లోటు ఏర్పడి శరీరానికి అవసరమైన శక్తి అందనప్పుడు, కండరాలను పనితీరు పెరిగి  శరీరానికి శక్తి లభిస్తుంది. దీని కారణంగా కండరాల నష్టం ఏర్పడుతుంది.


కండరాల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు తీసుకుంటూ శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.  ఇలా చేయడం వల్ల కండరాలు బలంగా ఉంటూనే శరీరంలో ఉన్న అదనపు కొవ్వు తగ్గి బరువు తగ్గడం జరుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలా? లేదా శరీరంలో కొవ్వు తగ్గించుకోవాలా? అనే విషయాన్ని శరీర స్థితిని బట్టి నిర్ణయించుకోవాలి.


                                             *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.