బండి పని మొదలెట్టేశారా!?

Publish Date:Jul 6, 2022

Advertisement

తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతి చరిత్రను బయటపెడతామంటూ జాతీయ కార్యవర్గ సమావేశాల ముంగింపు సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభలో చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ దిశగా పని మొదలెట్టేశారా అంటే ఔననే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఎలుకను పడతారో లేదో తెలియదు కానీ కొండను తవ్వే పని మాత్రం ప్రారంభించేశారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఇంత కాలం చెబుతూ వచ్చిన బండి సంజయ్ ఇప్పుడు వాటిని బయట పెట్టడం సంగతి అటుంచి సమాచారం కావాలంటూ ఆర్టీఐకి దరఖాస్తులు చేశారు.  

ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం కోరుతూ బండి సంజయ్ ఆర్టీఐకి దాదాపు 80  దరఖాస్తులు చేశారు. ప్రగతి భవన్ నిర్మాణం మొదలు ప్రభుత్వ ప్రకటనల వరకు అన్ని శాఖల నుంచి సమాచారం కోరుతూ ఈ దరఖాస్తులు చేశారు. ప్రజా కోర్టులో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆర్టీఐ ద్వారా సమాచార సేకరణ ఏంత వరకూ పనికొస్తుందని పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ అవినీతి సమాచారం ఆర్టీఐ దరఖాస్తులతో బయటకు వస్తుందని భావించడమే సరికాదని అంటున్నారు.   అయినా అవీనితిపై ఆధారాలున్నాయంటూ ఇంత కాలం చెబుతూవచ్చిన బండి సంజయ్ ఇప్పుడు కొత్తగా ఆర్టీఐ దరఖాస్తుల పేరుతో హడావుడి చేయడమే ఆయన వద్ద ఎటువంటి ఆధారాలూ, సమాచారమూ లేదనడానికి నిదర్శనమని పరిశీలకులు సైతం సెటైర్లు వేస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ దేశ వ్యాప్తంగా తమ రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్ విషయంలో మాత్రం అటువంటి హడావుడి చేయకపోవడం, కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని బట్టయబలు చేస్తాం... ఆధారాలున్నాయి అంటూ ప్రసంగాలతో చెలరేగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు సమాచారం కోరుతూ ఆర్టీఐని ఆశ్రయించడం చూస్తుంటే.. బీజేపీ, టీఆర్ఎస్ లు పరస్పర విమర్శలూ, ఆరోపణలూ ఏదో రాజకీయ డ్రామాగానే కనిపిస్తున్నాయని శిశ్లేషకులు అంటున్నారు.  

By
en-us Political News

  
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.