ధర్మాన మాటల మర్మమేంటి?

Publish Date:Jun 15, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ రెడ్డిలో వైనాట్ 175 ధీమా పూర్తిగా అడుగంటిపోయింది. అయినా బింకంగా ఈ తొమ్మది నెలలూ కష్టపడి పని చేద్దాం.. విజయం మనదే అని పార్టీ నేతలకు, క్యాడర్ కు చెప్పుకుంటూ వస్తున్నారు.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పని చేయండంటూ వారిని బతిమలాడుకుంటున్నారు. అయితే ఆయన కేబినెట్ లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలూ, నాయకుల మాటలు మాత్రం పార్టీ పరాజయం ఇప్పటికే ఖరారైపోయిందన్నట్లు మాట్లాడుతున్నారు. తాజాగా  రాష్ట్ర స్టాంప్లు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు   శ్రీకాకుళంలో  చేసిన వ్యాఖ్యలు పార్టీ పరువును నిలువుగా గంగలో ముంచేశాయి. ఇంతకీ ఆయనేమన్నారంటే గత నాలుగేళ్లుగా వైసీపీ కార్యకర్తలు  ఆర్థికంగా బాగా చితికిపోయారు.

జగన్  అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాల కోసం.. స్థానిక నేతలు, కార్యకర్తలు సొంత సొమ్ము ఖర్చు చేస్తూ వచ్చారు. ప్రభుత్వం కానీ, పార్టీ కానీ వారిని కనీసం పట్టించుకోలేదని  ధర్మాన ప్రసాదరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచో వస్తున్న నగదుతో  స్థానికంగా సమావేశాలు పెట్టడం లేదని.. కార్యకర్తల చేతి చమురు వదుల్చుకుని కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు.  
 
మరోవైపు గత మార్చిలో శ్రీకాకుళంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నిధుల పంపిణీ కార్యక్రమంలో ఇదే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. మగాళ్లు పోరంబోకులని.. తినేసి వెళ్లిపోతారని, ఇంటిని నడిపేది ఇల్లాలేనని.. అందుకే ఆమె పేరుతో ప్రభుత్వం పథకాలు అందిస్తోందని చెప్పారు.  ఇటీవల కాలంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏం మాట్లాడినా  వార్తల్లో  నిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన మాటలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేలా  ఉంటున్నాయి.    అయితే ధర్మాన లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు ఏదో యథాలాపంగా, నోరు జారీ పార్టీకి నష్టం చేసేలా మాట్లడడమేమిటన్న ఆశ్చర్యం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది.

అదే సమయంలో వారిలో  తనలో పార్టీ పట్ల, పార్టీ అధినేత పట్ల పేరుకున్న అసంతృప్తిని ఈ విధంగా వెళ్లగక్కుతున్నారా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి.  అదీ కాక తన రాజకీయ వారసుడిగా తనయుడు మనోహర నాయుడికి పార్టీ టికెట్ కోసం ధర్మాన చేసిన విజ్ణప్తిని సీఎం, పార్టీ అధినేత జగన్ నిరాకరించడం వల్లే ధర్మాన ప్రసాదరావు  పార్టీకి చేటు కలిగేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్న సందేహమూ వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది. 

By
en-us Political News

  
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.