యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్‌పై ఉక్కుపాదం: డీజీపీ సీవీ ఆనంద్

Publish Date:Oct 17, 2026

Advertisement

డ్రగ్స్‌ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా  దేశవ్యాప్తంగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ సి. వి. ఆనంద్‌ తెలిపారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్ద ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివాస్) సందర్భంగా సిఆర్పిఎఫ్ నోడల్ ఏజెన్సీగా సమన్వయంతో  దేశ వ్యాప్తంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు,  పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవులకు చెందిన బైక్‌ రైడర్లు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ బారినపడి యువత తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  కృషి చేస్తున్నాయి అన్నారు. తెలంగాణలో ఈగల్‌ ఫోర్స్‌, పోలీసు శాఖ సమన్వయంతో డ్రగ్స్‌ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

దేశంలోని భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ జాతీయ సమైక్యతే అందరి లక్ష్యమని పేర్కొన్నారు. ఐక్యత, సామాజిక బాధ్యతను చాటిచెప్పడంతోపాటు డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఉద్దేశంగా మాదకద్రవ్యాల పై పోరాటం అనే ఇతివృత్తం తో  ఈ ర్యాలీ  నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 2029 డిసెంబర్ నాటికి డ్రగ్స్ మాదక ద్రవ్యాల రహిత భారత్ , నశా ముక్త్ భారత్ సహకారానికి అందరం కలిసి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఈగల్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణ  కోసం డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా డీజీపీ వివరించారు.

తెలంగాణ  పోలీస్ సిబ్బంది కూడా రైడ్  లో పాల్గొన్నారు. రైడర్లు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ, సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరుకోవాలని డీజీపీ  సూచించారు. ఈ ర్యాలీలో పాల్గొంటున్న బైక్‌ రైడర్లు వివిధ ప్రాంతాల మీదుగా ప్రయాణించి అక్టోబరు 30 నాటికి గుజరాత్‌లోని కెవడియాకు చేరుకోనున్నారు. అక్టోబరు 31న సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా అక్కడ నిర్వహించే జాతీయ ఐక్యతా/ రాష్ట్రీయ ఏక్తా దివాస్  కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో డీజీపీ తో  పాటుగా ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ సీపీ సజ్జనార్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారి విక్రమ్, నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్ తో పాటుగా పోలీసు అధికారులు సిబ్బంది, ఎన్ సి సి విద్యార్థులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.


[ DGP CV Anand, Drug Abuse, Drug Free Society, Anti Drug Campaign, Drug Mafia, Drug Trafficking, Drug Control, Youth Against Drugs, Telangana Police, Anti Narcotics Operations, Drug Awareness, Drug Menace, Youth Safety, War Against Drugs, Telangana DGP Latest News, Hyderabad Drug News, Drug Prevention, Narcotics Control ]


 

By
en-us Political News

  
సద్ధుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.
 ఉపరితల ఆవర్తనానికి తోడు ఈశాన్య రుతుపవనాల విస్తరణ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 
నగర శివారు ప్రాంతాల్లో సోషల్ మీడియా రీల్స్ వైరల్ క్రేజ్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర విన్యోసాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి.
దసరా రోజున పాలపిట్టలను సహజ సిద్ధమైన వాతావరణంలో, చెట్లపై స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే తిలకించాలని అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎక్కడైనా పక్షుల బంధనం లేదా విక్రయం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే అటవీ శాఖ   అధికారులకు సమాచారం అందించాలని కోరింది.  
ఎప్పుడూ రద్దీగా ఉండే భాగ్యనగరం బోసిపోయింది. అయితే నగరం నుంచి ఊళ్లకు వెళ్లే రహదారులు, జాతీయ రహదారులు ట్రాఫిక్ జామ్ లతో దాదాపుగా బ్లాక్ అయ్యాయి. ఊళ్లకు వెడుతున్న జనాలతో నిండిన వాహనాలు పెద్ద సంఖ్యలో రహదారులపైకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది.
జ్ఞాన ప్రదాయిని అయిన అమ్మవారిని మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే సకల విద్యాభివృద్ధి కలుగుతుందని, పిల్లలకు  బుద్ధికుశలత లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే  తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది   తమ చిన్నారులతో కలిసి బాసర క్షేత్రానికి పోటెత్తారు.
నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో   ప్రతికూల ప్రభావం చూపిందని, దీని ఫలితంగా రాష్ట్రంలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు సుమారు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయని వెల్లడించిన సీఎస్..  సింగూరు డ్యామ్ దాని పరిసర ప్రాంతాలలో నీటి లభ్యతను, పంటల పరిస్థితిని   క్షేత్రస్థాయిలో పరిశీలించాననీ,  భూగర్భ జలమట్టాలు అత్యంత ఆందోళనకరంగా పడిపోయాయని తెలిపారు.
ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్ ఆరోపణల వెనుక నిజమెంత.?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా వారిపై కన్ను వేసి ఉంచడం ఎంత ముఖ్యమో చెప్పడానికి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఒక హృదయవిదారక ఘటనే నిదర్శనం.
 హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎల్బీనగర్‌ హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన కౌకూర్ ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.