అరసవెల్లిలో భక్తులకు తీవ్ర నిరాశ... మూలవిరాట్ ను తాకని సూర్యకిరణాలు
Publish Date:Mar 10, 2025
Advertisement
శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించిన భక్తులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సోమవారం ఉదయం కూడా సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ను తాకలేదు. ప్రతి ఏడాది రెండుసార్లు జరిగే ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో అరసవెల్లికి వస్తుంటారు. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల కారణంగా ప్రతీ యేడాది మార్చి 9, 10 తేదీల్లో ఉత్తరాయణం , అక్టోబర్ 1, 2 తేదీల్లో దక్షిణ యానం ఆనవాయితీగా వస్తోంది. సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరాయణంకు మారే సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు అరసవెల్లికి వచ్చారు. వరుసగా రెండ్రోజులు మూలవిరాట్ ను సూర్యకిరణాలు తాకుతాయని ఎదురు చూసి భంగపడ్డారు. మబ్బుల కారణంగా సూర్య కిరణాలు మూలవిరాట్ వరకు చేరుకోలేదు.
http://www.teluguone.com/news/content/devotees-in-arasavelli-are-deeply-disappointed-the-sun-rays-did-not-touch-moolavirat-25-194135.html





