కూటమిలో జనసేన త్యాగాలే ఎక్కువ..మాకు అన్యాయం చేయవద్దు.. పవన్ సంచలన వ్యాఖ్యలు.!

Publish Date:Oct 11, 2026

Advertisement

చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.! 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఓట్లు ఎన్ని వచ్చాయన్నది తాను పట్టించుకోలేదని, కేవలం అభివృద్ధే ప్రామాణికమని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. ఏజెన్సీలో రోడ్ల నిర్మాణం అభివృద్ధికి తొలిమెట్టు అని తెలిపారు. టీడీపీ, బీజేపీలతో కూడిన కూటమిలో ఇప్పటివరకు జనసేన పార్టీయే అత్యధికంగా త్యాగాలు చేసిందని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీఎం చంద్రబాబు జైలుపాలైన క్లిష్ట సమయంలో జనసైనికులే ముందుండి పోరాడారని గుర్తుచేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ నాయకులు మరింత పట్టు సాధించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

కూటమిలోని అన్ని పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. పార్టీ, కూటమి కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళల త్యాగాలను గుర్తించి, పొత్తు ధర్మానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేశారు. ఆదివారం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని కాకవాడలో అడవితల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి నాయకులు సమష్టిగా పోరాడారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కష్టపడిన నాయకులకు భరోసా కల్పించేలా ఉండాలని ఆకాంక్షించారు.

గిరిజనుల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ అభివృద్ధి ఫలాలను ప్రతి ఆవాసానికి అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2019–2024 మధ్య గ్రామీణ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురయ్యాయని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రజల అవసరాలకు ఖర్చు చేయాల్సిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం, వాటిని తొలగించి మళ్లీ రంగులు వేయడం వంటి పనుల కోసం ఖర్చు చేసిందని ఆరోపించారు. ఆ నిధులను అభివృద్ధికి వినియోగించి ఉంటే అనేక గ్రామాలకు మెరుగైన రహదారులు అందేవని అన్నారు. ప్రతిపక్ష మద్దతు ఉన్న పంచాయతీలకు కూడా అవసరమైన నిధులు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఏ పార్టీకి లాభం కలగాలన్నది కాకుండా వ్యవస్థ బలోపేతం, గ్రామాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 

 

[ Deputy CM Pawan Kalyan, Mata-Manti program, Polavaram District Rampachodavaram, Election of local bodies, Tribal Communities, Andhra Pradesh Politics, Tamarind Tree Meeting, Indigenous Welfare, TeluguOne News, Rampachodavaram, Tribal Welfare Andhra Pradesh, Rakota Village ]

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతల అరెస్టు వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.