డీలిమిటేషన్ సెగ: చంద్రబాబుకు తలనొప్పేనా?

Publish Date:Jun 16, 2026

Advertisement

తెలుగువన్ స్పెషల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ముసలం పుడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్ )బిల్లు  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారన్న వార్తలతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజక వర్గాల సంఖ్యను ఏకంగా 50 శాతం మేర పెంచి, మొత్తం 815 స్థానాలకు చేర్చాలనేది ప్రాథమిక ప్రతిపాదన. అయితే..  దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహా మండలి ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో 543 స్థానాలను మరో 9 శాతం పెంచాలని చేసిన సిఫారసులే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

గతంలో 2009లో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియలో కేవలం నియోజక వర్గాల సరిహద్దులను మాత్రమే మార్చారు..   సీట్ల సంఖ్య పెరగలేదు. కానీ ఈసారి సీట్ల సంఖ్య భారీగా పెరగబోతోంది. విచిత్రం ఏంటంటే, ఈ విభజన అంతా జనాభా ప్రాతిపదికన సమపాళ్లలో జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రత్యేకమైన పాకెట్లను మాత్రమే టార్గెట్ చేస్తూ పునర్విభజన చేసేలా ఆర్థిక సలహా మండలి నివేదిక ఇచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న  అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా సీట్లు పెరగవు. ఇదే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే..  ఈ సిఫారసుల వల్ల కోస్తా తీర ప్రాంతాలైన విజయవాడ, ఏలూరు వంటి బలమైన కేంద్రాల్లో స్థానాలు పెరగడం లేదు. కానీ వైసీపీకి  మొదటి నుంచి కంచుకోటగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో ఏకంగా 10 లోక్ సభ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాయలసీమలోని కడప, కర్నూలు, నంద్యాల, రాజంపేట, అనంతపురం వంటి ఐదు కీలక పార్లమెంట్ నియోజక వర్గాలను ఒక్కొక్కదానిని మూడు మూడు నియోజక వర్గాలుగా విస్తరించాలని చూస్తున్నారు. కేవలం హిందూపూర్‌ను మాత్రమే ఇందులో వదిలేశారు. వైసిపి బలహీనపడిందని భావిస్తున్న తరుణంలో.. ఆ పార్టీకి పట్టున్న ప్రాంతంలో ఇలా సీట్లు పెరగడం భవిష్యత్తులో జగన్ మోహన్ రెడ్డికి కలిసివచ్చే అంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఇది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే   కార్యక్రమమేనని సీనియర్ జర్నలిస్టులు వీవీ రావు, గోపి విశ్లేషించారు. 

ఇటు తెలంగాణలోనూ ఇదే వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణలో అత్యంత ధనిక ప్రాంతాలైన చేవెళ్ల, మల్కాజ్‌గిరి, మెదక్, సికింద్రాబాద్ వంటి స్థానాలను రెండు లేదా మూడుగా విభజించే ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ( ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ విభజన ద్వారా భవిష్యత్తులో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు అవసరం లేకుండా, ఒంటరిగానే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాలనేది బిజెపి అసలు వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో మహిళా బిల్లు సమయంలో నియోజక వర్గాల పెంపు కోసం విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తమ స్వరాష్ట్రంలో ఇలాంటి అసమానతలతో కూడిన విభజన ప్రతిపాదన వస్తే ప్రజలకు ఏం సమాధానం చెబుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సరిహద్దుల మార్పు రాజకీయం తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును ఎలా మార్చబోతుందో చూడాలి.

By
en-us Political News

  
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.