లిక్కర్ దందా...బయటపడుతున్న తాడేపల్లి ప్యాలస్ లింకులు!?

Publish Date:Sep 10, 2022

Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కారం విషయంలో విపక్షం తన సతీమణి భారతిపై ఆరోపణలు చేస్తుంటే కౌంటర్ ఇవ్వకుండా సైలంట్ గా ఉంటారా? అంటూ జగన్ తన మంత్రివర్గ సభ్యులపై ఫైర్ అయినే మంత్రి పదవులు ఊడబీకి పారేస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరించినా ఎవరూ కూడా పెదవి విప్పకపోవడానికి కారణమేమిటన్నది మెల్లమెల్లగా బయటకు వస్తోంది.

ఏ ఢిల్లీ లిక్కర్ స్కాంపై జగన్ సతీమణి భారతిపై ఆరోపణలు వచ్చాయో అదే లిక్కర్ స్కార్ డొంక మెల్లిమెల్లిగా కదులుతోంది. తాజాగా జరిగిన ఈడీ రైడ్స్ లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి పాత్ర ఉందని బయటపడింది. ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే రఘునందనరావు మీడియాకు వెల్లడించారు. తాజాగా ఈడీ జరిపిన సోదాల్లో విజయసాయి అల్లుడి పేరు బయటపడింది. సృజన్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీలపై దాడులు నిర్వహించిన ఈడీ దాడుల్లో ఇందుకు సంబంధించి ఆధారాలు లభ్యమయ్యయని ఆయన మీడియా ముందు చెప్పారు. విజయసాయి లింకులు ఢిల్లీ లిక్కర్ దందాలో ఉన్నాయంటే.. వాటి వెంబడే తాడేపల్లి లింకులు కూడా బయటపడతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాం లో తన సతీమణిపై వచ్చిన ఆరోపణలతో జగన్ తీవ్ర అసహనానికి లోనయ్యారని చెబుతున్నారు. అయితే జగన్ ఎంతగా బెదరించినా, హెచ్చరికలు జారీ చేసినా ఆయన కేబినెట్ సహచరులు జగన్ కోరుకున్న విధంగా విపక్షం విమర్శలను అగ్రసివ్ గా ఖండించకపోవడమే.. విపక్షాల ఆరోపనల్లో ఏదో మేరకు వాస్తవం ఉందనడానికి నిదర్శనంగా వారు చెబుతున్నారు. ఇలా ఉండగా జగన్ కేబినెట్ నుంచి ఉద్వాసన చెబుతానని హెచ్చరించిన తరువాత అమాత్యుల నుంచి మర్యాద గీత దాటిన ఖండనలు మాత్రమే రావడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.

 మంత్రి పదవులు ఇచ్చింది బుగ్గకార్లు ఎక్కి తిరగడానికా ? అంటూ కొందరు మంత్రులకు జగన్ ముఖం మీదనే క్లాసు పీకారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  కొందరు మంత్రులు ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల విషయంలో అంటీ ముటగ్టనట్టు వ్యవహరిస్తున్నారనీ, అటువంటి వారికి ఉద్వాసన తప్పదనీ సీఎం ఘాటుగానే హెచ్చరించారని కూడా అంటున్నారు. ఇంత ఘాటు హెచ్చరికలు చేసిన మంత్రులలో ఏ మాత్రం స్పందన లేకపోవడం.. కేబినెట్ లో సీఎంకు పట్టు సడలిందనడానికి తార్కాణమని అంటున్నారు.  అందుకు కారణం మంత్రులు, ఎమ్మెల్యేలలో పలువురికి సీఎం తీరు పట్ల తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం కావడమేనని పరిశీలకులు అంటున్నారు. సీఎం మీటలు నొక్కి తన గ్రాఫ్ బ్రహ్మాండంగా ఉందని అనుకుంటున్నారనీ, ప్రభుత్వం, పార్టీపై వ్యక్తమౌతున్న ప్రజా వ్యతిరేకత అంతా మంత్రులు, ఎమ్మెల్యేల వల్లనేనని సమయం, సందర్భం వచ్చినా రాకున్నా పదేపదే చెబుతూ తమ ప్రతిష్టను జనాలలో చిన్నబుచ్చడానికే ప్రయత్నిస్తున్నారన్నది వారి అసహనానికి, ఆగ్రహానికీ కారణంగా చెబుతున్నారు. 

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.