ఢిల్లీ ఎల్జీ మళ్లీ కిరికిరి

Publish Date:May 20, 2023

Advertisement

అధికారుల బదిలీ, పోస్టింగులు సహా సేవా వ్యవహారాల్లో ఢిల్లీ ప్రభుత్వానికి గత వారం సుప్రీంకోర్టు కార్యనిర్వాహక అధికారం ఇచ్చింది. అయితే.. ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా.. ఢిల్లీ ప్రభుత్వం అధికారాలను తగ్గించాలనే కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆరోపిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ తో కలసి కేంద్రం కుట్ర చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీ సర్వీసెస్ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భరద్వాజ్ కూడా కేంద్రంపై ఆరోపణలు చేశారు. సేవల కార్యదర్శి ఆశిష్ మోరే బదిలీకి సంబంధించిన ఫైల్ ను క్లియర్ చేయడానికి.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో సమావేశానికి హాజరు కావాలని తన క్యాబినెట్ సహచరులందరినీ కోరారు.

కోర్టు ఆదేశాలను లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు పాటించడం లేదు. రెండు రోజులుగా సేవా కార్యదర్శి ఫైల్స్ పై ఎందుకు సంతకం చేయలేదు? వచ్చేవారం ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా.. సుప్రీంకోర్టు తీర్పును కేంద్రం తిప్పికొట్టబోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్డినెన్స్ కోసం ఎదురు చూస్తున్నారా, అందుకే ఫైలుపై సంతకం చేయలేదా అనే అనుమానం వ్యక్తం చేస్తూ  కేజీవాల్ ట్వీట్ చేశారు.

సర్వీసెస్ సెక్రటరీని మార్చే ఫైల్ను తొక్కిపెట్టడం ద్వారా ఎల్బీ సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా కోర్టు తీర్పును అమలు చేయకుండా ఉండే కుట్ర జరుగుతోందన్నారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా పదవి చేపట్టినప్పటి నుంచి.. వీకే సక్సేనా.. కేజ్రివాల్ ప్రభుత్వాన్ని ఏదో వంకతో ముప్పు తిప్పలు పెడుతున్నారు. పాలనాపరమైన అధికం ఇక నుంచి ఢిల్లీ సర్కార్ దే అని గత వారం దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినా.. లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం ఆ ఆదేశాలను బేఖతారు చేస్తూ.. ఢిల్లీ ఆప్ సర్కార్ కుమళ్లీ ఊపిరి ఆడకుండా చేయడం ఏమిటి,  ఇది పూర్తిగా కేంద్రం డైరెక్షన్ లోనే జరుగుతోందని కేజ్రివాల్ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఢిల్లీ రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరో వైపు ఢిల్లీ మంత్రి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనీ, బెదరిస్తున్నారనీ ఎల్జీ సక్సేనా కేజ్రీవాల్ కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.