జగన్ కు ఓటమి భయం.. ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ల భయం!

Publish Date:Sep 17, 2022

Advertisement

ఏపీ సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుంది. ఆయన ప్రతి మాటలోనూ ఆ భయం ప్రస్ఫుటమౌతోంది. మూడు రాజధానుల విషయంలో తన మొండితనం మొదటికే మోసం తెచ్చిందా అన్న అనుమానం కూడా ఆయనలో మొదలయ్యిందన్న భావన కనిపిస్తోంది. రేపల్లెలో రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ ఫ్లెక్సీలు, గతంలో ఎన్నడూ లేని విధంగా తరచూ ఎమ్మెల్యేలతో సమావేశాలు, చీటికీ మాటికీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇవన్నీ ఆయనలో ఓటమి భయాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కొంచం కష్టపడితో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలలోనూ గెలుపు మనదే అన్న ధీమా వ్యక్తం చేసిన నెలల వ్యవధిలోనే జగన్ తన ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం.. బుగ్గ కారుల్లో తిరగడం తప్ప మీరేం పని చేయడం లేదంటూ కేబినెట్ సహచరుల మీద ఫైర్ అవ్వడం, మంత్రి పదవులు పీకేస్తాను జాగ్రత్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం ఆ భయానికి నిదర్శనాలని వారు అంటున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడంచబోతున్నాం అని ఉత్సాహంగా చెప్పిన జగన్.. ప్రతి నియోజకవర్గానికీ మంత్రి పదవి హామీ ఇవ్వడం.. తన క్విడ్ ప్రొకో వ్యవహారాన్ని నియోజకవర్గ ప్రజల దగ్గరకు కూడా తీసుకువెళ్లారని అంటున్నారు.

జగన్ ధీమా ప్రకటనలతో క్యాడర్ భరోసాతో ఉండటంతో.. తమతో సమావేశాలలో జగన్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో వైసీపీ ఎమ్మెల్యేలలో వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ వస్తుందా అన్న భయం మొదలైందని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే జగన్ ఆదేశాలు అమలు చేసే విషయంలో కూడా వారు గతంలోలా ఉత్సాహం చూపడం లేదంటున్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో కానీ, ఎంతగా ఒత్తిడి వస్తున్నా గడపగడపకూ కు మొహం చాటేయడం ఇందులో భాగమేనని చెబుతున్నారు.  జగన్ తనలో ఓటమి భయాన్ని దాచుకుని బయటకు చూపుతున్న గాంభీర్యం ‘రాజుగారి దేవతా వస్త్రం’లాగే ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఓటమి భయంతో.. తన వల్ల కాదు.. ఎమ్మెల్యేల నిష్క్రియాపరత్వం వల్లే రాష్ట్రంలో పరిస్థితులు పార్టీకీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయని జగన్ చెప్పుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారనీ, అందుకే ఇటీవల ఎమ్మెల్యేలతో భేటీ అయిన రెండు సందర్భాలలోనూ ఆయన ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

బటన్ నొక్కి తాను ప్రజాభిమానాన్ని చూరగొని పార్టీ గ్రాఫ్ పెంచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంటే.. ఎమ్మెల్యేలు మాత్రం తన వ్యవహార శైలితో ప్రజలలో చులకన కావడమే కాకుండా పార్టీ ప్రతిష్టను, ప్రభుత్వ పరువును మంటగలుపుతున్నారని జగన్ నిర్మొహమాటంగా ఎమ్మెల్యేల ముఖం మీదే చెప్పేస్తున్నారు. జగన్ కు అవకాశం ఉంది కనుక బటన్ నొక్కు తున్నారనీ, తమకు ఆ అవకాశం ఇచ్చి నియోజకవర్గంలోని లబ్ధి దారులకు సంక్షేమం పంపిణీ చేసేందుకు ఆ బటన్ ను తమకు ఇస్తే తమ గ్రాఫ్ కూడా పెరుగుతుంది కదా అని వారంటున్నారు. ఒక వైపు ఇన్ చార్జిలు, మరో వైపు వాలంటీర్లు తమపై పెత్తనం చెలాయిస్తుంటే.. నియోజకవర్గంలో డమ్మీలుగా మిగిలిపోయామనీ, అందుకే ప్రజా వ్యతిరేకత అనేది ప్రభుత్వ విధానాల వల్ల, వాలంటీర్ల నిర్వాకం వల్లా వచ్చిందే తప్ప తమ వల్ల కాదనీ ఎమ్మెల్యేలు అంతర్గత చర్చల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగన్ తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికలలో సిట్టింగులకు సీటు గల్లంతేననిపిస్తోందని వారు అంటున్నారు.  ఎమ్మెల్యేలలో చాలా మంది ఇప్పటికే తమకు వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ రాదన్న స్థిర నిశ్చయానికి వచ్చేసినట్లు అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం (సెప్టెంబర్19)న ఎమ్మెల్యేలతో జగన్ మరోసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జగన్ మళ్లీ పాత పాటే పాడితే ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే మంత్రులకు పదవులు ఊడబీకేస్తానని హెచ్చరించినా వారిలో మార్పు రాకపోవడమే కాకుండా ఆయన హెచ్చరికలను లైట్ గా తీసుకున్న విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. పార్టీపై, ప్రభుత్వంపై మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన సతీమణిపై ఆరోపణలు వచ్చినా ఖండించనందుకు జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా మంత్రులు లైట్ తీసుకోవడమే వారు జగన్ నాయకత్వంపై గతంలోలా విశ్వాసం చూపడం లేదనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఇక ఈ నెల 19న జరిగే సమావేశం విషయంలో ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు.

గత రెండు సమావేశాలలో ఎదురైన అనుభవమే మరో సారి ఎదురౌతుందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పని తీరు మెరుగుపరుచుకోవాలని జగన్ క్లాస్ తీసుకుంటారనీ, అసలు నియోజకవర్గంలో పని చేసే అవకాశమే లేని తాము పని తీరు ఎలా మెరుగుపరుచుకోవాలని మధన పడుతున్నారు. ఈనెల19న జగన్ అన్ని నయోజకవర్గాలకు సంబంధించిన ఎమ్యెల్యేలు, పార్టీ నియోజకవర్గ బాధ్యలు, సమన్వయ కర్తలతో సమావేశం కానున్నారు.  

ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్టును తెప్పించుకుంటున్న జగన్   ఆ నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలకు గ్రేడింగ్ లు ఇచ్చి క్లాస్ పీకే అవకాశాలున్నాయని ఎమ్మెల్యేలే అంటున్నారు. ఏది ఏమైనా ఈ సారి కూడా సమావేశం తమకు క్లాస్ పీకడానికే పరిమితమైతే మాత్రం తమ సమస్యలను కూడా అధినేతకు ఎలుగెత్తి చెబుతామని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అదే జరిగితే ఈ నెల 19న జరిగే నియోజకవర్గాల సమీక్ష వైసీపీలో ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  జగన్ సమక్షంలోనే అసమ్మతి కట్టలు తెంచుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదంటున్నారు.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.