దాసరి సమాధిని శుభ్రం చేయించిన మంచు మనోజ్.. ప్రశంసల వెల్లువ
Publish Date:May 30, 2026
Advertisement
ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు దాసరి నారాయణ మరణించి సంవత్సరాలు గడిచినా, ఆయన జ్ఞాపకాలను అభిమానులు ఇంకా గుండెల్లో పెట్టుకుని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దాసరి నారాయణరావు సమాధి శిథిలావస్థకు చేరుకుందని తెలుసుకున్న నటుడు మంచు మనోజ్ వెంటనే స్పందించి...తన బృందంతో కలిసి అక్కడికి వెళ్లారు. సమాధి చుట్టూ పేరుకుపోయిన చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా మార్చేలా చర్యలు తీసుకుని ఆ ప్రాంతం మొత్తం శుభ్రం చేయించి..ప్రత్యేకంగా పాలాభిషేకం నిర్వహించి నివాళులర్పిం చారు. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాసరి నారాయణరావు పట్ల మంచు మనోజ్ చూపిన గౌరవాన్ని పలువురు సినీ అభిమానులు ప్రశంసిస్తు న్నారు. గురువుల్ని, పెద్దలను మరణానంతరం కూడా గౌరవించడం గొప్ప సంస్కృతి అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి స్పందన లేదు.. దాసరి నారాయణ రావు జ్ఞాపకాలను స్మరించు కుంటూ మంచు మనోజ్ చేసిన ఈ చర్య ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నేటిజెన్లు మాత్రం మంచు మనోజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/dasari-narayana-rao-36-221321.html





