సుప్రీం కోర్టులో దానం నాగేందర్ కు చుక్కెదురు: ఆయన పిటిషన్ ను డిస్మిస్.!
Publish Date:Sep 24, 2026
Advertisement
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన ఎమ్మెల్యే పదవిపై హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు ఆయన పిటిసన్ ను డిస్మిస్ చేసింది. హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ దానం నాగుందర్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల నగారా మోగడం ఖాయమూంది. కాగా దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తే తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు బెంచ్ సమర్థించింది. చట్టబద్ధంగా అనర్హత వేటు పడిందని, ఇంక ఎ మాత్రం ఆలస్యం చేయకుండా మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పుతో ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ జారీ చేయడమే తరువాయి అని న్యాయ నిపుణులు అంటున్నారు. [Danam Nagendra, Khairatabad bye election, Supreme Court verdict, MLA disqualification, Telangana politics, high court judgment, Telugu One]
http://www.teluguone.com/news/content/danam-nagendra-24-232344.html




