ముందే ఊహించాను: సుప్రీం తీర్పుపై దానం నాగేందర్‌ రియాక్షన్.!

Publish Date:Sep 24, 2026

Advertisement

 సుప్రీంకోర్టు తీర్పుపై దానం నాగేందర్‌ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సంపూర్ణంగా గౌరవిస్తున్నానని తెలిపారు. చట్టపరమైన ప్రక్రియపై ఉన్న గౌరవంతోనే తాను న్యాయపోరాటం చేశానని చెప్పారు. ఇక తన భవిష్యత్తును ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు.“సుప్రీంకోర్టు తీర్పు ఇలా వస్తుందని ముందే ఊహించాను. అయితే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ నిబంధనల ప్రకారం కొంత ఊరట లభిస్తుందని భావించాను. అందుకే చట్టపరంగా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాను” అని దానం నాగేందర్‌ తెలిపారు.

ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు దానం నాగేందర్‌ స్పష్టం చేశారు. ఖైరతాబాద్‌ ప్రజలతో తనకు దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడూ వారికి అండగా ఉన్నానని పేర్కొన్నారు.రాబోయే ఉప ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి వారి ఆశీర్వాదం కోరతానని దానం నాగేందర్‌ తెలిపారు. ప్రజల మద్దతు తనకే ఉంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

 పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. వ్యక్తిగతంగా వేరే పార్టీలో చేరితే తప్పు కాదని, కానీ పదవితో పాటే పార్టీ మారితే అది కచ్చితంగా ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకే వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో దానం నాగేందర్ దాఖలు చేసిన ప్రత్యేక లీవ్ పిటిషన్‌ను (ఎస్ఎల్‌పీ) కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.   ఈ పూర్తి రాజకీయ ఉత్కంఠకు కారణం 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.

 అయితే, అనంతర కాలంలో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు.   శాసనసభ్యుడిగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదులు చేశారు. అయితే తొలుత ఆ అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రతిపక్షాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా సెప్టెంబర్ 18వ తేదీన హైకోర్టు ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. 

స్పీకర్ ఉత్తర్వులను రద్దు చేస్తూ, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అనర్హత 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.   హైకోర్టు తీర్పును సవాళ్ చేస్తూ దానం నాగేందర్ సెప్టెంబర్ 19వ తేదీన సుప్రీంకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులో ఎలాంటి తప్పులేదని తేల్చిచెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు అధికారికంగా తేలిపోవడంతో పాటు, త్వరలోనే అక్కడ ఉపఎన్నిక నిర్వహణ అనివార్యమైంది. 

 

 

 

[ Danam Nagender, Khairatabad Bypoll, Supreme Court Verdict, MLA Disqualification, Telangana Politics, Party Defection, Supreme Court Verdict, Telangana Politics, BRS Party, KCR, KTR, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది.
మాజీ డీఎస్పీ భీమ్ రెడ్డి కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు కీలక చర్యలు చేపట్టారు.
హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ దానం నాగుందర్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో  ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల నగారా మోగడం ఖాయమూంది.  
చారిత్రక  నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న ఈ రెండు విమానాశ్రయాల ద్వారా ఆయా ప్రాంతాల సాంస్కృతిక విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్యాకెట్‌ చూస్తే కొత్తదే.. కానీ అందులోని సరుకు మాత్రం గడువు ముగిసినదే. లాభాల కోసం కొందరు వ్యాపారులు వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
గణేష్‌ నిమజ్జనానికి భారీ బందోబస్తు..20 వేల మంది పోలీసులతో పహారా..!
ఎడమవైపు మినార్ కింద ఉన్న బాహ్య గోడ కొంతకాలంగా బలహీనపడటమే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. ఈ చారిత్రక కట్టడాన్ని మరింత పటిష్టపరిచేందుకు, దెబ్బతిన్న భాగాలకు శాశ్వత మరమ్మతులు చేపట్టే నిమిత్తం ఇప్పటికే టెండర్ ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని
వినాయక నిమజ్జనాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, హీరో నాని, దర్శకుడు ఓదెల శ్రీకాంత్ చేసిన విజ్ఞప్తులపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు.
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది.
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ భూముల వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.