Publish Date:Jun 26, 2026
కాపు సామాజికవర్గ అగ్రనేత, కాపు ఉద్యమ కారుడు ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో, కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
అయితే ముద్రగడ పద్మనాభం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా.. 2024 ఎన్నికల్లో వైసిపి మళ్లీ గెలవకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని అప్పట్లో శపథం చేశారు. ఆ ఎన్నికలలో వైసిపి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ముద్రగడ పద్మనాభం తన మాట నెరవేర్చుకుని తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. 2024 ఎన్నికల ఘోర పరాభవం తర్వాత కూడా ఆయన జగన్ వెంటే నిలిచారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. తన కోసం సర్వస్వం ఒడ్డిన నేతను చూడటానికి జగన్ స్వయంగా రాకుండా.. సజ్జల రామకృష్ణారెడ్డి పంపించడంపై వైసీపీయులలోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్న తన తండ్రిని చూడటానికి కూడా రాకుండా జగన్ ముఖం చాటేయడం దారుణమని విమర్శించారు. గతంలో ముద్రగడ చేసిన సేవలను, వైసిపి కోసం ఆయన పడ్డ కష్టాన్ని జగన్ విస్మరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నమ్మి వచ్చిన నేతలను జగన్ ఇలాగే నట్టేట ముంచుతారంటూ జగన్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/criticism-mounts-over-jagan-shying-away-from-consoling-mudragada-25-224196.html
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.