Publish Date:Apr 15, 2024
కొన్నికొన్ని సందర్భాలను చూస్తే దేశంలో ఇంకా న్యాయం బతికే వుందన్న నమ్మకం కలుగుతూ వుంటుంది. లిక్కర్ కేసులో పూర్తిగా మునిగిపోయిన కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జపం చేసుకుంటున్నారు. అయితే ఆమెను కోర్టుకు విచారణకు తెచ్చిన ప్రతిసారీ టూమచ్ చేస్తున్నారు. కోర్టు ఆవరణలోనే మీడియాతో మాట్లాడటం, ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ.. కడిగిన ముత్యంలా, తోమిన ఇత్తడి చెంబులా బయటకి వస్తాను... లాంటి చిన్నపిల్ల చేష్టలు చేస్తూ వస్తున్నారు. ఇది చాలాకాలంగా గమనిస్తున్న వారికి చిరాకు కలిగిస్తున్న అంశం. అధికారం పోయినా, పాతాళానికి పడిపోయినా వీళ్ళ తీరు మారదా అన్న ఏహ్యభావం కలుగుతోంది. ఈరోజు కోర్టుకు హాజరైన కవిత తన పాత ధోరణిలోనే ‘ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ’ అనడాన్ని కోర్టు చాలా సీరియస్‌గా తీసుకుంది. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడ్డం, ఇష్టం వచ్చిన స్టేట్‌మెంట్లు ఇవ్వడం మీద హెచ్చరించింది. కోర్టు హెచ్చరించిన నేపథ్యంలో కవిత ఇకముందు అలాంటి వ్యాఖ్యలు చేయడం, మీడియాతో మాట్లాడ్డం చేయకపోవచ్చు.
ఒక విషయంలో కోర్టు పుణ్యమా అని కవిత కంట్రోల్లోకి వచ్చేశారు. అయితే కవితను మరో విషయంలో కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం వుంది. అది మాటమాటకీ ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేయడం.
‘జై తెలంగాణ’ అనే పదం చాలా పవిత్రమైన పదం. తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్ల గొంతుకలు నినదించిన పదం. ఆ పదాన్ని అదేదో తమ కుటుంబం ఆస్తిలాగా కవిత వినియోగిస్తున్నారు. లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న కవిత ‘జై తెలంగాణ’ పదాన్ని వినియోగించడం ఎంతమాత్రం బాగాలేదు. తమ సొంత సమస్యని మొత్తం తెలంగాణకు ఆపాదించడానికి కవిత ఈ పదాన్ని మాటమాటకీ ఉపయోగిస్తున్నారన్నది స్పష్టం. ‘జై తెలంగాణ’ పదం తెలంగాణలోని ప్రతి ఒక్కరిది. లిక్కర్ స్కామ్ మాత్రం కేవలం కల్వకుంట కవితది. కవిత ఈ పదాన్ని ఉపయోగించకుండా చేసేదెవరో! కవిత నోరు మూత పడేదెన్నడో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/court-warning-to-kavitha-39-173899.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.