రాఘవరెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ కొట్టివేత.. వైఎస్ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగిసినట్లేనా?

Publish Date:Nov 29, 2024

Advertisement

వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కడప జిల్లాలో అంతా తానై వ్యవహరించిన వైఎస్ అవినాష్ రెడ్డికి ఇప్పుడు ఒకదాని తరువాత ఒకటిగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధికారం అండతో జిల్లాలో సర్వ వ్యవస్థలనూ గుప్పిట్లో పెట్టుకుని ఆడింది ఆటగా పాడింది పాటగా చెలాయించిన వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పుడు సొంత మనుషులను కూడా కాపాడుకోలేని నిస్సహాయ స్థితికి చేరారు.

అసలే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిలుపై ఉన్న అవినాష్ రెడ్డి ఏ క్షణంలో ఆ బెయిలు రద్దౌతుందా అన్న భయంతో వణికి పోతుంటే పుండు మీద కారంలా తన పీఏ రాఘవరెడ్డిపై కేసులు నమోదు కావడం, ఆయన పారారీలో ఉండటం, ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే పరిస్థితుల్లో ఉండటంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాఘవరెడ్డి పోలీసులకు చిక్కితే వైఎస్ వివేకా హత్య కేసుతో పాటు మరిన్ని కేసులు తన మెడకు చుట్టుకోవడం ఖాయమని వివేకా కంగారు పడుతున్నారు. తాజాగా రాఘవరెడ్డి కడప కోర్టులో దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో ఏ కలుగులో దాగున్నా రాఘవరెడ్డిని అరెస్టు చేయడం ఖాయమని పోలీసులు అంటున్నారు. 

అసలు ఇంతకీ అవినాష్ పీఏ కోసం పోలీసులు ఎందుకు గాలిస్తున్నారు? ఆయన ఏ కేసులో అరెస్టునుంచి రక్షణ కోరుతూ యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ దాఖలు చేశారూ అంటూ.. సామాజిక మాధ్యమంలో అసభ్య పోస్టుల వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి విచారణలో వెల్లడించిన కీలక అంశాల ఆధారంగా పోలీసులు అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై కేసు నమోదు చేశారు.  రాఘవరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ నే తాను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసేవాడినని వర్రా రవీందర్ రెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో రాఘవరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కోసం గాలింపు ఆరంభించారు. ఇప్పుడు రాఘవరెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ ను కడప కోర్టు తోసిపుచ్చడంతో ఏ క్షణంలోనైనా రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.

రాఘవరెడ్డి అరెస్టైతే అవినాష్ రెడ్డి గుట్టు రట్టైనట్లేనని అంటున్నారు. దీంతో రాఘవరెడ్డి బెయిలు పిటిషన్ ను కొట్టివేయడం అవినాష్ కు షాకేనని అంటున్నారు.  ఇప్పటికే  వివేకా హత్య కేసులో  పీకల్లోతు ఇరుక్కుని ఉన్న అవినాష్ రెడ్డిపై ఇక సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల వ్యవహారంలోనూ ఉచ్చు బిగిసినట్లేనని అంటున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి తాజాగా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిలుపై ఉన్న ఆయన బెయిలును రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం తాజాగా భాస్కరరెడ్డికి నోటీసులు జారీ చేసింది. సుదీర్ఖ కాలంగా నత్తనడకన నడుస్తున్న వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు, విచారణ ఇక వేగం పుంజుకోవడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవరెడ్డి అరెస్టైతే ఇక అవినాష్ రెడ్డి చక్రబంధంలో ఇరుక్కున్నట్లేనని అంటున్నారు.  

By
en-us Political News

  
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.