Publish Date:Jun 24, 2022
తెలుగుదేశం నాయకుడు, హిందుపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి మళ్లీ తెలంగాణాలో విస్తరిస్తోంది. శుక్రవారం కొత్తగా 493కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 29,084 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 493 మందికి పాటిటివ్ నిర్ధారణ అయినట్టు తెలంగాణా వైద‌్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వీటిలో అత్యధికంగా హైదరాబాద్ లోనే 366 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం 3,332 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేడు కొత్తగా 336 కేసులు నమోదయ్యాయి. గురువారం 494 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
మరోవైపు.. నటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. రెండు రోజుల కిందట బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు, పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.
తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలకృష్ణ తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని బాలయ్య సూచించారు. తాను త్వరలోనే కోలుకొని సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటానన్నారు. హరీశ్ రావు వేదికపై బాలయ్య పక్కన కూర్చున్నారు. కోవిడ్ వ్యాప్తి పెద్దగా లేకపోవడంతో ఎవరూ మాస్కులు ధరించలేదు. బాలయ్య కరోనా బారిన పడినట్లు తేలడంతో.. హరీశ్ రావుతోపాటు కేన్సర్ హాస్పిటల్ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా ఒకింత టెన్షన్‌కు గురవుతున్నారు. మంత్రి హరీశ్ రావుకు గతంలోనే కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/corona-positive-to-balakrishna-39-138375.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది