హైదరాబాద్ కు మీనాక్షి నటరాజన్.. స్వాగతం పలికిన టీపీసీసీ చీఫ్
Publish Date:Feb 28, 2025
Advertisement
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ శుక్రవారం (ఫిబ్రవరి 28) ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా మీనాక్షీ నటరాజన్ రాష్ట్ర పర్యటనకు రావడం ఇదే తొలిసారి. రైలు మార్గం ద్వారా హైదరాబాద్ కు వచ్చిన ఆమెకు కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆమెకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, ఫహీం, రచమల్లు సిద్ధేశ్వర్ ఇతర కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. మీనాక్షి నటరాజన్ స్వయంగా ఆదేశించడంతో ఆమె రాక సందర్భంగా ఎక్కడా ఫ్లెక్సీల హడావుడి కనిపించలేదు. కాగా మీనాక్షి నటరాజన్ ను ఆమె బస చేసిన దిల్ కుష్ గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నేతలూ కూడా ఆమెతో భేటీ అయ్యారు.
http://www.teluguone.com/news/content/congress-telangana-sffairs-incharge-meenakshi-natarajan-arrives-hyderabad-25-193589.html





