రేవంత్ మౌనం పై కాంగ్రెస్ చార్జిషీట్?

Publish Date:Apr 21, 2025

Advertisement

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్‌ దాఖలు చేసింది. నిజానికి  ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో సోనియా, రాహుల్ గాంధీలతో పాటుగా, శ్యామ్ పిట్రోడా, ఆస్కార్ ఫెర్నాండెజ్ పేర్లు కూడా ఉన్నాయి. అయినా ఫోకస్ అంతా ఈ ఇద్దరిపైనే తప్ప మిగిలిన ఇద్దరినీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సోనియా, రాహుల్ గాంధీ పై చార్జిషీట్ దాఖలు చేయడాన్ని, తప్పు పడుతున్నారే  తప్ప  మొత్తంగా చార్జిషీటే తప్పని ఆనడం లేదు.   

ఇంతవరకు ఎవరిపైనా జరగని మహాపరాధం ఏదో  సోనియా, రాహుల్ విషయంలో  జరిగిపోయింద న్నట్లుగా మండిపడుతున్నారు. గుండెలు బాదుకుంటున్నారు. మిగిలిన ఇద్దరి గురించి, పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అందుకే..  విషయం తెలిసిన పెద్దలు ఇది  అందరికీ తెలిసిన  కాంగెస్ నేతల స్వామి భక్తికి, విధేయతకు చక్కని నిదర్శనం   అంటున్నారు.    

అయితే..  దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలంతా వీధుల్లోకి వచ్చి పోటాపోటీగా ఆందోళనలు చేస్తున్నారు, బీజేపీ పై విరుచుకు పడుతున్నారు, అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం  ఇంతవరకు ఈ విషయంపై పెదవి విప్ప లేదు. ఒక్క ముక్క మాట్లాడ లేదు. ఈడీ చర్యను ఖండించలేదు. కనీసం, ఒక ప్రకటన అయినా చేయలేదు. ఓ వంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు, నిన్న మొన్నట్లో ఎమ్మెల్సీ అయిన అద్దంకి దయాకర్  వరకూ కాంగ్రెస్ నాయకులంతా   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై, అరేయ్ ..ఒరేయ్  స్థాయిలో మండి పడుతున్నారు. అయినా..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం చీమైనా కుట్టినట్లు లేదు. కనీసంలో కనీసం ఒక  ఖండన  ప్రకటన కూడా చేయలేదు. అసలు తనకు ఏమీ సంబంధం లేని అంశం అన్నట్లుగా.. ఆయన తన పనిలో తాను బిజీబిజీగా  ఉన్నారని అంటున్నారు.

అయితే..  ప్రస్తుతం రేవంత్ రెడ్డి దేశంలో లేరు.   జపాన్ లో  పెట్టుబడుల వేటలో బిజీగా ఉన్నారు. అందుకే ఆయన స్పందించలేదని  కొందరు అనుకున్నా, ఎందుకో అది, అంతగా నమ్మబుల్  గా లేదని కాంగ్రెస్ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. అది నిజం కాదు.. కుంటి సాకు మాత్రమే అని  కాంగ్రెస్ పెద్దలే అంటున్నారు.  నిజానికి.. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు, పదవులు ఆశిస్తున్నవారు ఇలాంటి సందర్భాలను  అగ్రనేతల పట్ల విధేయత చూపేందుకు ఒక అవకాశంగా తీసుకుంటారు.

కప్పుడు శరద్ పవార్, తారిక్ అన్వర్, పీఏ సంగ్మా, సోనియా గాంధీ విదేశీ మూలాలను ప్రశ్నించిన సమయంలో  కొందరు వీర విధేయులు  ఏకంగా గాంధీ భవన్ లో అగ్గి పెట్టారు.  అంతవరకు ఎందుకు ఇదే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారిచినప్పుడు ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇప్పడు కూడా  దేశ వ్యాప్తంగా  కాంగ్రెస్ నాయకులు నిరసన పేరిట విధేయ ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. ఈడీ, మోదీలను జాయింట్ గా దుమ్మెత్తి పోస్తున్నారు. గాంధీ కుటుంబం త్యాగాలను ఏకరవు పెడుతూ కన్నీళ్లు కారుస్తున్నారు. అలాగే  భవిష్యత్ లో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే హెచ్చరించారు. ఎటొచ్చి రేవంత్ రెడ్డి   మాత్రమే సైలెంట్ గా ఉండి పోయారు. 

అయితే.. ఇప్పడు అదంతా ఒకెత్తు అయితే, రేవంత్ రెడ్డి మౌనం, ప్రతి పక్షాలకు, ముఖ్యంగా బీఆర్ఎస్ కు మరో అస్త్రం అయిందని  అంటున్నారు. సహజంగానే  రేవంత్ రెడ్డి ఎక్కడ దొరికితే అక్కడ విమర్శించేందుకు సిద్ధంగా ఉండే  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  ఇప్పటికే తొలి అస్త్రాన్ని సంధించారు.  మీడియా సమావేశంలో మాట్లాడుతూ  కేటీఆర్’  కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ,రాహుల్ గాంధీల పై ఈడీ చార్జిషీట్  దాఖలు చేయడానికి నిరసనగా  దేశంలోని కాంగ్రెస్‌ నేతలంతా ధర్నాలకు దిగుతూ బీజేపీని ఎండగడుతున్నారు. రాష్ట్రంలో కూడా పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. కానీ ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ల అగ్రనేతల మీద కేసులు పెట్టినా చడీ చప్పుడు లేదు. మోదీ, రేవంత్‌ దృఢమైన బంధమే ఇందుకు కారణం. ఆయనను ఈయన కాపడుతున్నారు..ఈయనను ఆయన కాపాడుతారు  అని  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అలాగే.. కాంగ్రెస్  సీనియర్ నాయకుడు ఒకరు  ఢిల్లీకి ‘కబురు  అందించారని అంటున్నారు.  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  శనివారం ( ఏప్రిల్ 19), చార్జిషీట్  ఫ్యూచర్ ఆక్షన్ పై చర్చించేందుకు ఢిల్లీలో ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జిలు, ఇతర ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన  సమావేశంలో రాష్ట్ర నాయకులు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను పూస గుచ్చినట్లు వివరిస్తూ.. రేవంత్ రెడ్డి అవిధేయ ధోరణికి సంబంధించిన అభియోగాలతో  ఆయనపై చార్జిషీట్ ని సమర్పించినట్లు చెపుతున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పంది స్తుందనేది  వేచి చూడవలసి ఉంటుందని..  ముఖ్యంగా రేవంత్ రెడ్డి జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన స్పందన చూసిన తర్వాతనే అధిష్టానం తదుపరి నిర్ణయం ఉంటుందని అంటున్నారు.

By
en-us Political News

  
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.