కాంగ్రెస్‌లో 119 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా కలకలం!

Publish Date:Jul 25, 2023

Advertisement

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి కాంగ్రెస్ లో ఎన్నడూ లేనంతగా జోష్ కనిపిస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీలో నామరూపాల్లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన పార్టీ అయినా కూడా తెలంగాణలో తీవ్రంగా దెబ్బతిన్నది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు తోడు కేసీఆర్ మార్క్ రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ నుండి నేతలు వలసెళ్లిపోయారు. తనకు రాష్ట్రంలో పోటీనే లేకుండా చేసుకొనే క్రమంలో కేసీఆర్ కాంగ్రెస్ ను దెబ్బతీశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వ లోపం కూడా తోడై తెలంగాణలో పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత వచ్చిన రెండు అసెంబ్లీ, రెండు పార్లమెంటు ఎన్నికల్లోనూ పేలవమైన ఫలితాలతో కాంగ్రెస్ చతికిల పడింది. ఆ పార్టీ నేతలు కూడా చప్పబడ్డారు.

కానీ, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో పూర్వ వైభవం కనిపిస్తుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు హుషారుగా కనిపిస్తున్నారు. అదే సమయంలో పార్టీలోకి వచ్చే నేతలు, సమావేశాలు, సంప్రదింపులతో హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ బిజీబిజీగా కనిపిస్తుంది. రాష్ట్రంలో అన్ని మూలల నుండి కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలకి చొచ్చుకుపోతుంది. రేపు ఎన్నికలలో విజయం  కోసం ఇప్పుడు నేతలంతా ఒకే తాటిపైకి చేరి కేసీఆర్ పై సమరశంఖం పూరిస్తున్నారు. అయితే, ఈ ఎన్నికలలో టికెట్లు దక్కేది ఎవరికి? నేతల ఎంపిక హైకమాండ్ ఆదేశిస్తుందా? లోకల్ లీడర్లు తమ వర్గం నేతలను సిఫార్సులు చేస్తారా? సర్వేల ఫలితంగానే టికెట్లు దక్కనున్నాయా? ఇలా రాజకీయ వర్గాలలో పలు చర్చలు కూడా జరిగిపోతున్నాయి.

అదలా ఉండగానే ఇదిగో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా అంటూ కాంగ్రెస్ లీడర్ల వాట్సాప్ లలో ఓ జాబితా చక్కర్లు కొడుతోంది. మొత్తం 119 నియోజకవర్గాల ప్రాబబల్స్ అన్న పేరుతో ఈ జాబితా వైరల్ అవుతుంది. దీంతో ఈ జాబితా ఇప్పుడు కాంగ్రెస్ నేతలలో కలకలం రేపుతోంది. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ తరపున తమకే టికెట్ దక్కుతుందని ఇప్పటికే ప్రజలలో ప్రచారం మొదలు పెట్టిన నేతలు ఈ జాబితాలో పేరు ఉండడంతో ఆనందంగా ఉంటే.. జాబితాలో లేని నేతలు తమ వర్గం నేతలతో సంప్రదింపులు మొదలు పెట్టారు. కాగా, ఈ జాబితా కూడా వ్యూహకర్త సునీల్ కనుగోలు పేరుతో ఉండడం విశేషం. సునీల్ టీం సర్వేలు చేసి ఫలితాల ఆధారంగా ఈ జాబితాను కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లుగా ప్రచారం జరుగుతుండగా.. కాంగ్రెస్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి ధృవీకరణ రాలేదు. 

వాస్తవానికి సునీల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే లేరు. కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వానికి సలహదారుగా ఈ మధ్యనే వెళ్లారు. అయితే సునీల్ టీం మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తుంది. ఒక రాష్ట్ర అభ్యర్థుల ఎంపిక లాంటి ముఖ్యమైన విషయం అంటే సునీల్ కూడా తెలంగాణకు వచ్చే ఖరారు చేస్తారు. కానీ, ఆయన ఇక్కడ లేకుండానే సునీల్ పేరిట ఈ జాబితా ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చిందనే విషయం అర్ధంకావటం లేదు. జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీకి ఇలా అభ్యర్థుల జాబితా పేరిట బ్రేకులు వేయాలనే ప్రత్యర్థి నేతల పన్నాగం కూడా కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా జాబితా విడుదల చేస్తే టికెట్ దక్కని అసంతృప్త నేతలు రెబల్స్ గా మారితే ప్రత్యర్థులకు బలం చేకూరుతుంది. మరి నిజంగానే ఈ జాబితా సునీల్ కాంగ్రెస్ అధిష్టానికి పంపారా? సునీల్ పేరు మీద మరెవరైనా జాబితా తయారుచేసి ప్రచారంలో పెట్టారా అన్నది తేలాల్సి ఉంది.

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.