బీఆర్ఎస్ తో పొత్తు .. పావులు కదుపుతున్న కాంగ్రెస్ పెద్దలు ?

Publish Date:Jan 20, 2023

Advertisement

కాంగ్రెస్ పార్టీతో పొత్తుకోసం కేసీఆర్... తహతహ లాడుతున్నారా? ప్రస్తుత పరిస్థితిలో  దేశం సంగతి ఎలా ఉన్నా రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలంటే, కాంగ్రెస్ ‘చే’ తోడు అనివార్యమనే నిర్ణయానికి వచ్చారా? అంటే, అవుననే అంటున్నారు, అటూ ఇటూ ఉన్న ముఖ్య నేతల సన్నిహిత నాయకులు. నిజానికి  ఇదేమి కొత్త విషయం కాదు. పొలిటికల్, మీడియా సర్కిల్స్ లో ఈ చర్చ చాలా కాలంగా జరుగుతూనే వుంది. ఇప్పుడు ఫ్రెష్ గా మరో మారు తెర మీదకు వచ్చింది. 

ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు భగ్గుమన్న నేపధ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ముఖ్య నేతలు కొందరు, అంతకు ముందు ఏంతో కాలంగా, తాము చేస్తూ వచ్చిన భారాస తో పొత్తు ప్రతిపాదనను మరో మారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఆ తర్వాత ప్రత్యేక పరిశీలకునిగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ ద్వారా తమ ప్రతిపాదనను మరో మారు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళారు. అప్పటినుంచి ఢిల్లీ హైదరాబాద్  మధ్య ‘పొత్తు’ ప్రతిపాదన చక్కర్లు కొడుతోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అధిష్టానికి ఇచ్చిన నివేదికలో భారాస, కాంగ్రెస్ పొత్తు ప్రస్తవన చేసినట్లు తెలుస్తోంది. 

ఈ నేపధ్యంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెర వెనక నడుస్తున్న రహస్య రాయబారాల వివరాలను బయట పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్లు తొమ్మిది నెలల క్రితం బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదనను ఏఐసీసీ ముందు పెట్టారని తెలిపారు. బీఆర్ఎస్‌తో పొత్తుపై ఏఐసీసీ తమ అభిప్రాయాలను అప్పట్లో కోరిందని, అప్పట్లో తాము వద్దని చెప్పినట్లు అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు గురించి పార్టీలో చర్చ జరిగిన మాట వాస్తవమేనని, తనకు పూర్తి సమాచారం ఉందని ఆయన అన్నారు.

టీఆర్ఎస్‌తో కొట్లాడుతున్నప్పుడు పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి సరెండర్ అయినట్లు ఉంటుందని అద్దంకి దయాకర్ అభిప్రాయపడ్డారు. గతంలో కేసీఆర్ బీహార్ వెళ్లి నితీష్ కుమార్‌ని కలిశారని, ఆ తర్వాత రెండు రోజులకే నితీష్ కుమార్ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి కేసీఆర్‌ను కాంగ్రెస్‌లో కలుపుకోవాలని కోరినట్లు అద్దంకి దయాకర్ చెప్పారు. కానీ రాహుల్ గాంధీ ఆ ప్రతిపాదనను పట్టించుకోలేదని, లైట్‌గా తీసుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఇప్పటికీ కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్లు ఏఐసీసీ దగ్గర బీఆర్ఎస్ పొత్తు గురించి ప్రపోజల్స్ ఇప్పటికీ పెడుతున్నారని, దయాకర్ స్పష్టం చేశారు.

 తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని, కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తుకు రావాలని గతంలో కాంగ్రెస్ జాతీయ నేతలు కొంతమంది చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తుపై ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తుండగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాటిని కొట్టిపారేస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ వరంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కూడా బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.

ఎవరైనా నేతలు బీఆర్ఎస్‌తో పొత్తు గురించి మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కూడా రాహుల్ వార్నింగ్ ఇచ్చారు.ఆ తర్వాత పొత్తు వార్తలకు చెక్ పడగా.. ఇటీవల మాణిక్యం ఠాగూర్ ఇచ్చిన రిపోర్టుతో మరోసారి చర్చ మొదలైంది. ఇదలా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ లో వర్గ పోరును చల్లార్చేందుకు, అధిష్టానం దూతగా హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ ను కలిసిన మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకరు తెలంగాణలో బీజేపీ అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ తో పొత్తు అవసరమని చెప్పినట్లు తెలుస్తోంది. భారాస పొత్తుతో పోటీచేయడం వలన కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారాన్ని పంచుకుంటుంది.అదే ఒంటరిగా పోటీ చేసి ముక్కోణ పోటీలో ఇరవై పాతిక సీట్లు గెలిచినా, గత అనుభవాలను బట్టి చూస్తే  గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోవడం కష్టమవుతుందని ఆయన వివరించినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గద్దల్లా ఎగరేసుకు పోవడానికి బీఆర్ఎస్ కు తోడు ఇప్పుడు బీజేపీ కూడా సిద్ధంగా ఉందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, నిర్ణయం తీసుకోవాలని ఆయన హితబోధ చేసినట్లు తెలుస్తోంది. 

దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాగా, తొలి పర్యటనలో కొంత సమాచారం సేకరించిన  తెలంగాణ కాంగ్రెస్ కొత్త  ఇంచార్జి మాణిక్‌రావు థాకరే, తాజా పర్యటనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు విషయం పై కూడా ప్రత్యేక దృష్టి కేద్రీకరిస్తారని తెలుస్తోంది.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.