బండికి తలంటు..బీజేపీలో అదే అయోమయం!

Publish Date:Jul 22, 2023

Advertisement

తెలంగాణ బీజేపీ పరిస్థితి అయోమయంగా మారింది. నిన్న మొన్నటి వరకూ రాష్ట్రంలో అధికారం మాదే అన్న స్థాయిలో బిల్డప్ ఇచ్చిన ఆ పార్టీ ఇప్పుడు ఉనికి కూడా ప్రశ్నార్థకమైపోయిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లుగా కాకుండా బండి సంజయ్ సన్మాన సభగా మారిపోయింది.

ఆ సభలో బండి సంజయ్ తనలోని అసంతృప్తిని, అసమ్మతిని, ఆవేదనను వెళ్లగక్కితే.. సభలో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభృతులు బండికి అండగా నిలబడతామని ఉద్ఘాటించారు. సభకు హాజరైన కార్యకర్తలు కూడా బండికి అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇక బీజేపీ అధిష్టానం ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఈటల టార్గెట్ గానే బండి ప్రసంగం సాగిందని పార్టీ శ్రేణుల నుంచే గట్టిగా వినిపిస్తున్నది. బండికి వ్యతిరేకంగా బీజేపీ హైకమాండ్ కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసినది ఈటలేనని అర్ధం వచ్చేలా బండి ప్రసంగం సాగిందని అంటున్నారు. మొత్తంగా కిషన్ రెడ్డి  రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్వహించిన సభ వల్ల బీజేపీలో ఉన్న లుకలుకలను, వర్గ విభేదాలను మరోసారి బహిర్గతం చేసిందనడంలో సందేహం లేదు.

అంతే కాదు.. ఈ సభ బీజేపీకి పూడ్చుకోలేనంతగా నష్టం కూడా చేకూర్చింది. కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి ముళ్ల కిరీటమేనన్నది సందేహాలకు అతీతంగా తేటతెల్లం చేసింది ఈ సభ. దీంతో బీజేపీ అధిష్టానం కంగుతింది. దీంతో బండి సంజయ్ ను మందలించింది.  నా  పని అయిపోయింది, కనీసం కిషన్ రెడ్డిని అయినా ఆయన పని ఆయనను చేసుకోనివ్వండి.. అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయకండి అంటూ బండి వ్యాఖ్యలపై బండిని ప్రశ్నించడమే కాకుండా పార్టీకి నష్టం చేకూర్చేలా మాట్లాడవద్దని సుతిమెత్తగా క్లాస్ పీకినట్లు చెబుతున్నారు. దీంతో బండి సంజయ్  మరింతగా మనస్తాపం చెందారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. 

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.