పాపం కమ్యూనిస్టులు!

Publish Date:Apr 5, 2025

Advertisement

ఖమ్మం లో తగ్గుతున్న ప్రాభవం
జిల్లాలో బలహీన పడిన కామ్రేడ్స్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీల ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు జిల్లాలో రాజకీయాలను శాసించిన కామ్రేడ్లు నేడు దాదాపుగా జీరోకు చేరుకున్నారు. 1980 లో జరిగిన సమితి ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు (సీపీఎం,సీపీఐ) జిల్లా లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 1983 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎన్టీఆర్ ప్రభంజనాన్ని  తట్టుకొని మరీ సముచిత స్థానాలు దక్కించుకున్నారు. ఆ తరువాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల్లో నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో కలసి పనిచేయడం, ఎన్నికలలోనూ ఐక్యంగానే పోటీ చేయడం ప్రారంభించారు. ఆ రకంగా 1994 వరకు కలసి పోటీ చేసి గణనీయంగా లబ్ధి పొందారు.  మధ్యలో ఒకటి రెండు సార్లు తెలుగుదేశంతో విభేదించినా పలు ఎన్నికల్లో కలసి పోటీచేశారు. 1999 నుంచీ ఆ పార్టీకి దూరంగా ఉన్నారు.  

ఆ తర్వాత 2004 లో కాంగ్రెస్ తో కలసి పోటీచేసి మంచి ఫలితాలు సాధించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ తో కలసి పోటీచేసిన ప్రతిసారి కమ్యూనిస్టులకు జిల్లాలో మంచి ఫలితాలు వచ్చాయి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా గా ఉన్న సమయంలోనే కమ్యూనిస్టులు కాస్త దూరంగా ఉండటం ప్రారంభించారు. ముదిగొండ లో ఇళ్ల స్థలాల కోసం జరిగిన ఆందోళనలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఐదుగురు సీపీఎం కార్యకర్తలు చనిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సీపీఎం కు దూరం పెరిగింది.

ఆ తర్వాత సీపీఎం జిల్లా నాయకత్వంలో జరిగిన పరిణామాలతో సీనియర్ కామ్రేడ్ లు కొందరు కాంగ్రెస్ లో చేరిపోయారు. అప్పటి నుంచి జిల్లాలో సీపీఎం బలహీనపడింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో సీపీఎం ఆ ఉద్యమానికి దూరంగా ఉంది. సీపీఐ మాత్రం ఉద్యమంలో భాగస్వామి అయింది.  తెలంగాణ ప్రకటన నేపథ్యంలో 2014 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరిగా పోటీచేసిన సీపీఎం ఖమ్మం జిల్లాలో  మాత్రం  విచిత్రంగా వైసీపీ తో పొత్తు పెట్టుకుంది. సీపీఐ మాత్రం కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది . సీపీఎం ఒక్క భద్రాచలం అసెంబ్లీ ని మాత్రమే గెలుచుకుంది. సీపీఐ ఒక్క స్థానం కూడా గెలవలేదు.  

అప్పటి నుంచి జిల్లాలో కమ్యూనిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. సీపీఎం, సీపీఐ ల మధ్య కూడా సంత్సంభందాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.  అంతేకాదు రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో లో 7 స్థానాల్లో 2018  స్థానాల్లో 8, 2023 లో 8 స్థానాల్లో ఆ పార్టీ నే గెలిచింది. కొత్తగూడెం లో ఆ పార్టీ మద్దతు తో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు.

అసెంబ్లీ ఎన్నికలే కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి. జిల్లాలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతుదారులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు జిల్లాలో కమ్యూనిస్టు పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది.. సీపీఎం ఖమ్మం టౌన్, భద్రాచలం ప్రాంతంలో కాస్త క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తోంది. సీపీఐ ఖమ్మం రూరల్ ప్రాంతంతో పాటు కొత్తగూడెం నియోజకవర్గంలో కనిపిస్తోంది.. ఇక సీపీఐ (ఎంఎల్) పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగానే ఉంది. ఆ పార్టీ లో సైద్ధాంతిక విభేదాల తో విడిపోయి బలహీనపడున్నారు. జిల్లాలో ఇప్పట్లో కమ్యూనిస్టు పార్టీలు పూర్వ వైభవం సంతరించుకోవడమనేది అసాధ్యంగానే కనిపిస్తోంది. 

By
en-us Political News

  
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(68) ఆదివానం (ఏప్రిల్ 20) దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని తన నివాసంలోనే హత్యకు గురయ్యారు. ఈ హత్య చేసినది ఆయన భార్యేనని పోలీసులు అనుమానిఃస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర మంత్రి పెమ్మసాని నిలువెత్తు నిఘంటువుగా అభివర్ణించారు. . చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన ప్రసంగాలతో కూడిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఏపీ అసెంబ్లీ హాల్ లో ఆదివారం (ఏప్రిల్ 20)జరిగింది.
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 75వ జన్మదినం సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ఇతర రాష్ట్రాలలో దేశంలోని ఇత‌ర రాష్ట్రాల్లో అధ్య‌యనం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే నారాయణ బృందం గుజరాత్ వెళ్లింది.
ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని వైన్స్ షాపులు ఈ నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వైన్ షాపు అనుమతులు రద్దు చేస్తామని ఇప్పటికే హైదరాబాద్ సీపీతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు.
సీఎం చంద్రబాబు చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్‌లో రెండు పుస్తకాలను రఘురామకృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆవిష్కరించారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలకు సంబంధించి, రెండు పుస్తకాలను జయప్రద ఫౌండేషన్‌ ప్రచురించింది. పుస్తకాలను టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్‌, సీనియర్‌ పాత్రికేయులు, రచయిత విక్రమ్‌ పూల రూపొందించారు. ‘స్వర్ణాంధ్రప్రదేశ్‌ సారథి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు’ పేరుతో రెండు సంపుటాలు ప్రచురించారు.
ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం కోసం భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ రూ.44 లక్షల విరాళం అందించారు. దీంతో ఈ రోజు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించారు. అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్‌, కర్నూలుకు చెందిన కొందరు భక్తుల నుంచి బీఆర్‌ నాయుడు అభిప్రాయాలు తెలుసుకున్నారు.
కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చేరిగారు. తెలంగాణ భవన్‌లో రాజేంద్ర నగర్ ఇంచార్జ్ ప‌టోళ్ల కార్తీక్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీలో అత్తాపూర్ డివిజన్ నుండి శ్రీరామ్ రెడ్డి, పలు పార్టీల నేతలు చేరారు. వారంద‌రికి కేటీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతు కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలకు తెలంగాణ ప్రజలు టెంప్ట్ అయి ఆ పార్టీకి అవకాశం ఇచ్చారని.. ఫలితంగా తినే అన్నంలో మట్టిపోసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఎన్ని కథలు చెప్పినా ఓటర్ హైదరాబాద్ ప్రజలు వారి మాటలను నమ్మలేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మంచి చేస్తే ఎవరైనా అభినందిస్తారని.. గతంలో వైఎస్సార్, చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులను, వారిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు బ‌ర్త్ డే సెలబ్రేషన్స్ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాలయాల్లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆలయాల్లో నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75 కిలోల కేక్‌ కట్‌ చేసి వేడుకలు చేసుకున్నారు.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీజీఆర్‌టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేస్తామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డించారు. అతి త్వ‌ర‌లోనే 3,038 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేస్తామ‌న్నారు.
డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం చేయిచేయి కలుపుదామని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్ టీవర్క్స్‌ వద్ద నోటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెగాస్టార్ వర్చువల్‌ సందేశం పంపారు. డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం చేయిచేయి కలుపుదామన్నారు. వ్యసనాలకు బానిసలై కొందరు తమ కలలను దూరం చేసుకుంటున్నారని చెప్పారు. మాదకద్రవ్యాల కట్టడిపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు అందరం అవగాహన కల్పించాలని కోరారు.
ఏపీ సీఎం చంద్రబాబు వజ్రోత్సవ 75వ పుట్టిన రోజు సందర్బంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సీబీఎన్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తాజాగా చంద్రబాబునాయుడికి ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "నాన్నగారికి శుభాకాంక్షలు. నా స్ఫూర్తి నారా చంద్ర‌బాబు నాయుడు గారూ. వెరీ హ్యాపీ బ‌ర్త్ డే" అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.