మీకు కొత్తగా పెళ్ళైందా? ఈ తప్పులు చేస్తే రిలేషన్ నాశనమే!

Publish Date:May 15, 2026

Advertisement

వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ కొన్నిసార్లు, అనుకోకుండా అనేసిన కొన్ని మాటలు ఆ సంబంధాన్ని పాడుచేసే అవకాశం ఉంటుంది. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో వచ్చే ఏ చిన్న అపార్థమైనా.. ఏ చిన్న తప్పు మాట అయినా.. ఇద్దరి మధ్య దూరం పెంచి  బంధాన్ని నాశనం చేసి  అవకాశం ఉంటుంది.  బంధం చాలా కాలం పాటు ప్రేమ, నమ్మకంతో నిండి ఉండాలంటే చేయకూడని తప్పులేంటో తెలుసుకుంటే..

పాత బంధాల ప్రస్తావన..

కొత్తగా పెళ్లైన  తర్వాత గత సంబంధాల గురించి ప్రస్తావించడం తరచుగా భాగస్వామికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పదేపదే  పాత రిలేషన్ లో ఉన్న వ్యక్తితో  పోల్చడం లేదా పాత జ్ఞాపకాలను పంచుకోవడం సంబంధంలో అభద్రతను పెంచుతుంది. వైవాహిక బందంలో ఎప్పుజూ ప్రస్తుత కాలంపై దృష్టి పెట్టాలి. అప్పుడే బంధం బాగుంటుంది.

కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడటం..

పెళ్లి తర్వాత రెండు  కుటుంబాలను గౌరవించడం చాలా ముఖ్యం. లైఫ్ పార్ట్నర్  కుటుంబం గురించి చెడుగా మాట్లాడటం లేదా వారిని ఎగతాళి చేయడం సంబంధంలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. ఒకవేళ ఏదైనా విషయం నచ్చకపోతే దాన్ని ప్రశాంతంగా వివరించడానికి ప్రయత్నించాలి.

ఫిర్యాదులు..

చిన్న చిన్న విషయాల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేస్తుంటే అది  సంబంధంలో ప్రతికూలతను పెంచుతుంది. కొత్త పెళ్లిలో ఒకరి అలవాట్లను ఒకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అందువల్ల, ఓర్పు , అవగాహన కలిగి ఉండటం ముఖ్యం.

పోలిక..

లైఫ్ పార్ట్నర్ ను  స్నేహితుడు, బంధువు లేదా సోషల్ మీడియా జంటతో పోల్చడం  బంధానికి  హాని కలిగిస్తుంది. ప్రతి వ్యక్తి, ప్రతి సంబంధం భిన్నంగా ఉంటాయి. పోలికలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, విభేదాలను పెంచుతాయి.

స్వేచ్ఛ..

పెళ్లి తర్వాత అన్ని విషయాల గురించి క్వశ్చన్లు వేయడం  లేదా మితిమీరిన జోక్యం చేసుకోవడం చేస్తే అది  భాగస్వామికి బాధ కలిగించే అవకాశం ఉంటుంది. ప్రేమతో పాటు వైవాహిక జీవితంలో కూడా  వ్యక్తిగత స్వేచ్ఛ కూడా చాలా అవసరం. ఒకరినొకరు నమ్మితేనే  బంధం  బలంగా ఉంటుంది.

                              *రూపశ్రీ.

By
en-us Political News

  
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.