14న హైదరాబాద్ లో కాక్రోచ్ జనతాపార్టీ భారీ నిరసన!
Publish Date:Jun 12, 2026
Advertisement
భారతదేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జంతా పార్టీ ఇప్పుడు హైదరాబాద్ లో భారీ నిరసన నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా పురుడుపోసుకుని, దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపిస్తున్న ఈ వినూత్న ఉద్యమం తెలంగాణ గడ్డపై కాలూనుతోంది. ఈ నెల 14న హైదరాబాద్ వేదికగా ఒక భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించబోతున్నట్లు కాక్రోచ్ జనతాపార్టీ ప్రకటించింది. దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నిరసన సాగనుంది. ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఇండియన్ కాక్రోచ్ జనతాపార్టీ దేశ సరిహద్దులను దాటి విస్తరించింది. మీడియాలో పుట్టిన ఈ కాక్రోచ్ ట్రెండ్ ఇప్పుడు పాకిస్థాన్ లోకి కూడా చొచ్చుకెళ్లింది. అక్కడ కూడా స్థానిక యువత ఈ కాన్సెప్ట్‌కు ఆకర్షితులై కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్ వంటి సరికొత్త గ్రూపులను సోషల్ మీడియాలో ప్రారంభించారు. భాగ్యనగర వీధుల్లో యువత శాంతియుతంగా వినిపించబోయే ఈ గళం, రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు కారణమవుతుందో వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/cockroach-janata-party-to-stage-massive-protest-in-hyderabad-39-222655.html





