అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!

Publish Date:Aug 5, 2026

Advertisement

 

భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ మర్యాదపూర్వక భేటీ 30 నిమిషాలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలు చర్చించారు. తెలంగాణలో విద్య, ఉపాధి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.  ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాలను పెంచాలని,  వీసా అపాయింట్‌మెంట్లు సకాలంలో లభించేలా సహకరించాలని కోరారు. 

వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచాలని, వీసా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని కోరారు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణ కు చెందిన వివిధ రంగాల నిపుణుల సమస్యలను కూడా రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. H-1B వీసా ప్రాసెసింగ్‌, రెన్యువల్‌, వీసా స్టాంపింగ్‌ ఆలస్యం కాకుండా సరళతరం చేయాలని కోరారు. వీసా నిబంధనల్లో వచ్చే మార్పులపై ముందుగానే సమాచారం అందించాలని సూచించారు. అమెరికాలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల భద్రత, సంక్షేమంపై కూడా చర్చించారు. 

తెలంగాణలో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, స్టార్టప్‌లు, పరిశోధన, ఆధునిక సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. అమెరికా విశ్వవిద్యాలయాలు తెలంగాణ విద్యాసంస్థలతో కలిసి పనిచేసేలా సహకరించాలని కోరారు. విద్యార్థుల మార్పిడి, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు. 

అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారతీయ భాషల్లో తెలుగు ఒకటని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. భారతదేశ చరిత్ర, సంస్కృతిపై రాయబారి సెర్జియో గోర్‌కు ఉన్న అవగాహన తనను ఆకట్టుకుందన్నారు. ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు, రాష్ట్ర బలాలపై రాయబారి చూపిన ఆసక్తిని ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణ–అమెరికా మధ్య వ్యాపారం, పెట్టుబడులు, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని రాయబారి సెర్జియో గోర్ హామీ ఇచ్చారు.

CM Revanth Reddy meets Sergio Gore, H-1B Visa Processing, Telangana Goverment, American Ambassador

By
en-us Political News

  
హైదరాబాద్ బోనాల జాతర.. భక్తుల సందడి.. కిక్కిరిసిన రహదారులు.. ఇదే అదనుగా మహిళలను వేధిస్తూ రెచ్చిపో తున్న ఆకతాయిలకు షీ టీమ్స్‌ చెక్ పెట్టాయి.
ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో ఎలోన్ మస్క్ సంచలన ప్రకటన! స్టార్‌లింక్ V3 శాటిలైట్లు మరియు స్టార్‌షిప్ రాకెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100 రెట్లు వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు స్పేస్ ఎక్స్ సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కొత్త డెల్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? టెక్ నిపుణులు పరీక్షించి 4.5 స్టార్ రేటింగ్ ఇచ్చిన డెల్ ఎక్స్‌పిఎస్, ఇన్‌స్పిరాన్, ఏలియన్‌వేర్ మరియు బడ్జెట్ ఆఫర్ మోడల్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఉద్యోగాల ఎంపికలో ఏఐ వినియోగంపై నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు. 64% మంది ఏఐ స్క్రీనింగ్‌ను, 70% మంది ఆన్‌లైన్ ఇంటర్వ్యూలను వ్యతిరేకిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది! పెళ్లి చేసుకునే మహిళలకు 8 గ్రాముల బంగారం, పుట్టిన బిడ్డకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించే కొత్త పథకాలను బడ్జెట్‌లో ప్రకటించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మరియు ఎన్‌బీఎఫ్‌సీలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI కీలక నిర్ణయం తీసుకుంది. 2026 అక్టోబర్ 1 నుంచి అమలుకానున్న కొత్త ఎఫ్‌డీ నిబంధనలు, వడ్డీ రేట్ల పారదర్శకత పూర్తి వివరాలు తెలుసుకోండి.
వాహనదారులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ విక్రయాలు నిలిపివేసేలా పైలట్ ప్రాజెక్ట్ ప్రతిపాదన. కొత్త కార్లు, బైకుల బీమా గడువు పెంపుపై సమగ్ర కథనం.
స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ శకలం గంటకు 8,690 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టింది. 4 టన్నుల బరువున్న ఈ భాగం తాకిడికి చంద్రుడిపై 60 అడుగుల వెడల్పు గల గొయ్యి ఏర్పడింది. ఈ ప్రమాదంపై నాసా ఏం చెబుతోందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వంట గ్యాస్, నేచురల్ గ్యాస్ వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం సెస్ విధించేందుకు సిద్ధమవుతోందా? ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 18 అదనపు భారం పడే అవకాశం ఉందా? రూ. 4.30 లక్షల కోట్ల వ్యూహాత్మక ఇంధన నిల్వల ప్లాన్ వివరాలు ఇవే!
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలు విధిస్తే భారాన్ని ఎవరు మోస్తారు? పన్నుల సవరణ బిల్లు 2026 నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇచ్చిన కీలక స్పష్టత మరియు సంపూర్ణ సమాచారం ఇక్కడ చదవండి!
సుదీర్ఘ విరామం తర్వాత లాహోర్ 1947 సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, తన భర్త జీన్ గుడెనఫ్ మరియు కవల పిల్లలు జై, జియాలే తన జీవితంలో మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కుటుంబం, కెరీర్ గురించి ప్రీతీ పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు ఇవే!
జగన్ పర్యటనల్లో  వైసీపీ  కార్యకర్తలు, మద్దతుదారులు రప్పారప్పా పోస్టర్లు, ఫ్లెక్సీలతో చెలరేగిపోయేవారు. అలాంటిది దేవరపల్లి ర్యాలీ సందర్భంగా రప్పా రప్పా డైలాగ్ వినిపించకపోవడం, కనిపించకపోవడం ఒకింత విస్మయపనిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.