చంద్రబాబు విజన్‌తో ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది : శివరాజ్ సింగ్ చౌహాన్

Publish Date:Oct 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి శంకుస్థాపన చేశారు. తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో ఓ లబ్ధిదారు కుటుంబంతో కలిసి ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.బుర్రిపాలెంలో లబ్ధిదారుడి ఇంటిని 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించనున్నారు. తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో అత్యంత పటిష్టమైన ఇళ్లను నిర్మించడమే ఈ సాంకేతికత లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఇంట్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేలా నిర్మాణం చేపడుతున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, శివరాజ్ సింగ్ చౌహాన్ లబ్ధిదారు కుటుంబంతో ఆప్యాయంగా మాట్లాడారు. కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను బహూకరించారు. తమ ఇంటికి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి చేతుల మీదుగా భూమిపూజ జరగడం ఎంతో సంతోషంగా ఉందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

చంద్రబాబు విజన్‌కు చౌహాన్ ప్రశంసలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగల సత్తా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే ఉందని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. చంద్రబాబు డైనమిక్, డెడికేటెడ్, డెసిసివ్ నాయకుడని కొనియాడారు. ఆయన విజన్‌కు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.భవిష్యత్తులో దేశానికి టెక్నాలజీనే అతిపెద్ద శక్తిగా చంద్రబాబు ఎప్పుడో గుర్తించారని చౌహాన్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఏపీలో ఏఐ, డేటా సెంటర్లు, క్వాంటం టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.అమరావతి అభివృద్ధిపై చంద్రబాబు విజన్ తనను ఆశ్చర్యపరిచిందని చౌహాన్ అన్నారు. ఆయన నిబద్ధత, కఠోర శ్రమతో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఐకాన్‌గా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

జగన్ పాలనపై చౌహాన్ విమర్శలు..!

గత ఐదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విమర్శలు చేశారు. పేదల ఇళ్ల కోసం కేంద్రం నిధులు కేటాయించినప్పటికీ.. గత ప్రభుత్వం తన వాటా ఇవ్వకుండా పథకాన్ని నీరుగార్చిందని ఆరోపించారు. కేంద్రం పంపిన నిధులను కూడా దారి మళ్లించారని విమర్శించారు.గత ప్రభుత్వం సక్రమంగా పనిచేసి ఉంటే ఈపాటికే పేదలందరికీ సొంత ఇళ్లు ఉండేవని అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేస్తే.. జగన్ మూడు రాజధానుల పేరుతో మరింత గందరగోళం సృష్టించారని ఆరోపించారు.

మరో 6 లక్షల ఇళ్లకు హామీ..!

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలందరికీ ఇళ్లు నిర్మించాలనే సంకల్పంతో ముందుకు వచ్చారని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర నిబంధనల ప్రకారం ఏపీకి 76 వేల ఇళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. చంద్రబాబు ప్రధాని మోదీని కలిసి మరిన్ని ఇళ్లు కేటాయించాలని కోరారని చెప్పారు.చంద్రబాబు విజ్ఞప్తి మేరకు తొలి విడతగా 3 లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. ఇవి కూడా సరిపోవని, మరో 6 లక్షల ఇళ్లు కావాలని చంద్రబాబు కోరారని.. తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మొదటి 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మరో 3 లక్షలు, ఆ తర్వాత ఇంకో 3 లక్షల ఇళ్లు మంజూరు చేసి.. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో, చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో పేదలందరికీ పక్కా ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేపట్టడం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

 

 

 

[ CM Chandrababu, Shivraj Singh Chouhan, Andhra Pradesh, PMAY Gramin 2.0, 3 Lakh Houses, Housing Scheme, 3D Concrete Printing, Buripalem, Tenali, AP Government, Central Government, PM Modi, Poor Housing, Amaravati Development, Andhra Pradesh Development, TDP, NDA, Housing for Poor] 

By
en-us Political News

  
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.