Publish Date:May 23, 2023
పరువు నిలువునా గంగలో కలిసిపోయింది. వివేకా హత్య కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తీరు పార్టీ పరువునే కాకుండా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి జగన్ పరువును కూడా మంటగలుపుతోందన్న భావన తాడేపల్లి ప్యాలెస్ వర్గాల్లో గట్టిగా వ్యక్తమౌతోంది. అయ్యిందేదో అయ్యింది. ఇక ఎలాంటి ఓవర్ యాక్షన్ చేయొద్దు.. తిన్నగా సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్పష్టమైన సందేశం అవినాష్ కు చేరిందని అంటున్నారు.
ఆ సందేశాన్ని కూడా వాళ్లూ వీళ్లూ కాదు స్వయంగా ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మ ద్వారా పంపారని అంటున్నారు. సోమవారం (మే22) కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లిన విజయమ్మ అవినాష్ తల్లిని పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అవినాష్ తో ఆమె కొద్ది సేపు ముచ్చటించారు. ఆ సమయంలోనే అవినాష్ ను ఇక ఈ హై డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టి సీబీఐ విచారణకు హాజరవ్వాలని సూచించినట్లు చెబుతున్నారు. సూచన కాదు దాదాపుగా ఆదేశించారనే అంటుంటున్నారు. ఒక వేళ సీబీఐ అరెస్టు చేసినా కంగారు పడాల్సిన అవసరం లేదనీ, అక్రమాస్తుల కేసులో తన బిడ్డ జగన్ 16 నెలలు జైలులో ఉండి రాలేదా అని కూడా విజయమ్మ అవినాష్ కు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఇప్పటికే వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ దర్యాప్తునకు హాజరు కాకుండా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ అవినాష్ వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ ప్రతిష్ట దిగజారిందనీ, అలాగే జగన్ కూ చెడ్డపేరు వచ్చిందనీ, ఇక ఫుల్ స్టాప్ పెట్టకుంటే నివారించలేనంత నష్టం జరుగుతుందని విజయమ్మ అవినాష్ కు నచ్చ చెప్పిట్లు వైసీపీ శ్రేణులే అంటున్నాయి. అయితే చివరి ఆశగా సుప్రీంలో అవినాష్ దాఖలు చేసిన నిర్ణయంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని అవినాష్ విజయమ్మతో అన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు సుప్రీంలో కూడా అవినాష్ కు ఎలాంటి ఊరటా లభించలేదు. ఇక అవినాష్ ఏం నిర్ణయం తీసుకుంటారని అంతటా ఉత్కంఠ నెలకొంది.
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి విషయంలో రోజుల తరబడి సాగుతున్న దాగుడు మూతలు, ‘హైడ్రామా’తో జనంలో చెడ్డపేరు వస్తోందని సీఎం జగన్ శిబిరం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ‘రచ్చ’కు ఇక ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. మంగళవారం సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడకపోతే... ఆయనే సీబీఐ విచారణకు హాజరయ్యేలా అవినాశ్‌ను ఒప్పించే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘అరెస్టు చేస్తే చేసుకోని! తర్వాత చూసుకుందాం. జగన్ కూడా 16 నెలలు జైలులో ఉన్నారు కదా! ఇప్పుడు జరుగుతున్న తంతుతో నీకూ చెడ్డపేరు. మాకూ ఇబ్బంది’’ అని అవినాశ్‌కు సమాచారం పంపినట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/clear-cut-message-to-avinash-25-155786.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.