ఇండియా కూటమి నేతలతో భేటీకి సీజేఐ నో: పిటిషన్ రూపంలో కోర్టును ఆశ్రయించాలని స్పష్టీకరణ.!

Publish Date:Oct 11, 2026

Advertisement

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు. ఇండయా కూటమి నేతలు తన సమస్యలను పిషిషన్ రూపంలో కోర్టు ముందుండాలని ఆయన పేర్కొన్నారు. దీంతో  నేడు  ఇండియా కూటమి నేతల చలో సుప్రీం కోర్టు మార్చ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  

కాగా సీజేఐ ఇండియా కూటమి నేతల భేటీని తిరస్కరించడానికి వారు.. ఇప్పటికే   విచారణలో ఉన్న అంశాలపై తనతో చర్చించాలని భావిస్తుండటమే కారణమని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే వారి అభ్యర్థనను సీజేఐ సూర్యకాంత్ తిరస్కరించారనీ, పిటిషన్లను విచారించి తీర్పులు ఇవ్వడమే న్యాయస్థానాల విధి అని ఆయన పేర్కొన్నారనీ తెలుస్తోంది.   ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు కట్టుబడి ఉందని, న్యాయస్థానం తలుపులు అందరికీ ఎల్లవేళలా తెరిచే ఉంటాయనీ సీజేఐ పేర్కొన్నట్లు సమాచారం. 

ఎస్‌ఐఆర్‌లో అక్రమాలు జరిగాయని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌  జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ అంశంపై సోమవారం (అక్టోబర్ 12) చలో సుప్రీంకోర్టు   మార్చ్‌ చేపట్టాలని నిర్ణయించింది. ఈ నిరసన ఏ ఒక్క రాజకీయ పార్టీకి పరిమితం కాదని, భారతీయులందరిదీనని కాంగ్రస్ అగ్రనేత, లోక్‌సభలో  ప్రధాన ప్రతిపక్ష నేత  రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల సంస్కరణలపై ఇండియా కూటమి ఇప్పటికే  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. సీఈసీ రాజీనామా, 2023 చట్టం రద్దు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ నిలిపివేత, తొలగించినట్లు ఆరోపిస్తున్న 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్ల పునరుద్ధరణ కోరుతూ ఆ వినతి పత్రం సమర్పించింది.   

[CJI Surya Kant Reject, INDIA Bloc Plea, Rahul Gandhi, Mallikarjun Kharge, Supreme Court, , Vote Theft Allegations, Election Commission, SIR, Telugu One]

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.